Monday, April 29, 2024

నాకేం వయసు మీరింది..నేనెందుకు రిటైర్ కావాలి: శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

ముంబై: క్రియాశీల రాజకీయాల నుంచి తాను తప్పుకోవాలంటూ అజిత్ పవార్ చేసిన సలహాకు ఆయన బాబాయ్, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సార్టీ అధ్యక్షుడిగా తను కొనసాగుతానని, పార్టీ కార్యకర్తలు తాను కొనసాగాలనే కోరుకుంటున్నారని శరద్ వవార్ శనివారం విలేకరల సమావేశంలో చెప్పారు.

మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా అని పవార్ అజిత్‌ను ప్రశ్నించారు. తనకు ప్రధానమంత్రి అవ్వాలని కాని మంత్రిని అవ్వాలని కాని లేదని, ప్రజలకు సేవ చేయడమే తన ఏకైక లక్షమని ఆయన అన్నారు.

తన బాబాయకు 83 ఏళ్లు వయసుందని, ఆయన రాజకీయాల నుంచి రిటైర్ తమకు ఆశీస్సులు అందచేయాలని ఎన్‌సిపి తిరుగుబాటు ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా తనకు ఇంకా వయసు మీరలేదని అంటూ న టైర్డ్ హూ, న రిటైర్డ్ హూ(అలసిపోలేదు..రిటైర్డ్ కాలేదు) అన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తాను రిటైర్ కావాలని చెప్పడానికి వారు ఎవరని శరద్ పవార్ ప్రశ్నించారు.

తాను ఆయన(శరద్ పవార్)సొంత కుమారుడిని కానందువల్లే తనను కుటుంబ వారసునిగా ప్రకటించలేదంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా ఈ అంశంపై తాను మాట్లాడదలచుకోలేదని, కుటుంబ వ్యవహారాలను తాను బహిరంగంగా మాట్లాడబోనని శరద్ పవార్ స్పష్టం చేశారు.

అజిత్ పవార్‌కు మంత్రి పదవితోపాటు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చామని, కాని తన కుమార్తె సుప్రియా సూలేకు మాత్రం అవకాశం ఉన్నప్పటికీ మంత్రి పదవి ఇవ్వలేదని శరద్ పవార్ చెప్పారు. కేంద్రంలో ఎన్‌సిపికి మంత్రిపదవి దక్కినప్పటికీ ఎంపి అయినప్పటికీ సుప్రియకు కాకుండా వేరేవారికి ఆ పదవి ఇచ్చామని ఆయన అన్నారు.

మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్, మరో 8 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేఇరన వారం రోజుల తర్వాత శనివారం నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనకు శరద్ పవార్ శ్రీకారం చుట్టారు. తిరుగుబాటు ఎమ్మెల్యే ఛగన్ భుజ్‌బల్ సొంత నియోజకవర్గం నాశిక్ జిల్లాలోని యోలా నుంచి ఆయన పర్యటన చేపడుతున్నారు. పార్టీ పునర్నిర్మాణానికే ఈ పర్యటన చేపట్టినట్లు శరద్ పవార్ ఇప్పటికే ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News