Monday, April 29, 2024

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగుల కొరత

- Advertisement -
- Advertisement -

Shortage of employees in public sector banks

నెలవారీ రిక్రూట్‌మెంట్ ప్లాన్‌తో రండి
నేడు బ్యాంక్ ఉన్నతాధికారులతో కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ సమావేశం

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు భారీగా సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. దీని వల్ల బ్యాంకుల పనితీరుపైనా ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఉన్నతాధికారులతో ఈ నెల 21న(బుధవారం) సమావేశానికి పిలుపునిచ్చింది. అంతేకాదు బ్యాంకులు అన్ని నెలవారీ రిక్రూట్‌మెంట్ ప్లాన్‌తో రావాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 1000 మంది ఖాతాదారులకు ఒక ఉద్యోగి ఉంటారు. ప్రైవేటురంగ బ్యాంకుల్లో 100 నుంచి 600 మంది ఉద్యోగులకు ఒక ఉద్యోగి ఉన్నారు. 2021 మార్చిలో ఆర్‌బిఐ డేటా ప్రకారం, 10 సంవత్సరాలలో బ్యాంకుల శాఖల సంఖ్య 28 శాతం పెరిగి 86,311కి చేరింది. అదే సమయంలో ఎటిఎంల సంఖ్య 58,193 నుంచి 1.4 లక్షలకు పెరిగింది. 2010-11 సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొత్తం 7.76 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, 2020-21 నాటికి అది 7.71 లక్షలకు తగ్గింది.

బ్యాంకుల్లో డిజిటల్ వినియోగం, ఎటిఎంలు పెరగడంతో క్లర్క్‌లు, సబార్డినేట్ సిబ్బంది నియామకాలు 26 శాతం తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో దాదాపు 5 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2021 డిసెంబర్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని ఇచ్చారు. 2021 డిసెంబర్ 1 వరకు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మంజూరైన మొత్తం పోస్టుల్లో 5 శాతం అంటే 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థికమంత్రి తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం మంజూరైన పోస్టుల్లో 95 శాతం భర్తీ చేసినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఎస్‌బిఐలో అత్యధికంగా 8,544 బ్యాంకు ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో 3,423 ఉద్యోగాలు ఆఫీసర్లకు, 5,121 క్లర్క్ సిబ్బందికి ఖాళీగా ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 6,743, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6,295, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 5,112, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4848 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News