Sunday, April 28, 2024

ఎన్‌సి 22 యాక్షన్ బిగిన్స్

- Advertisement -
- Advertisement -

హీరో అక్కినేని నాగచైతన్య, దర్శకుడు వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి ‘ఎన్‌సి 22’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. నాగచైతన్యకు తొలి తెలుగు, తమిళ ద్విభాషా చిత్రమిది కాగా వెంకట్ ప్రభుకి కూడా ఇది తొలి తెలుగు సినిమా. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరూ కలసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌లో చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఖాయమని చెప్పాలి. నాగ చైతన్య అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. బుధవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. “అక్కినేని నాగేశ్వరరావు దివ్య ఆశీస్సులతో.. నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి అద్భుతమైన అప్‌డేట్‌ను ప్రకటిస్తున్నాం. బుధవారం నుండి ‘ఎన్‌సి 22 యాక్షన్ బిగిన్స్’ అని ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా నాగ చైతన్య సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇది అందరినీ సర్‌ప్రైజ్ చేయడంతో పాటు ఆసక్తిని పెంచింది. పోస్టర్‌లో నాగ చైతన్యపై కొన్ని టార్గెట్‌లు వుండటం గమనించవచ్చు. పోస్టర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్స్‌లో పవర్‌ఫుల్ వైబ్స్‌ని కలిగివుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు.

Naga Chaitanya New Film Shoot begins

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News