Monday, April 29, 2024

జూన్‌లో 10 కోట్ల డోసుల కొవిషీల్డ్ ఉత్పత్తి చేసిన ఎస్‌ఐఐ

- Advertisement -
- Advertisement -

SII produced 10 crore doses of Covishield in June

 

న్యూఢిల్లీ: సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) ముందస్తు అంచనాకు తగ్గట్టుగానే కొవిడ్19 టీకాలను ఉత్పత్తి చేసిందని డిసిజిఐ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ నెలలో 10.80 కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకాలను ఉత్పత్తి చేసినట్టు పేర్కొన్నది. ఉత్పత్తి పెరగడం వల్ల 18 ఏళ్లు పైబడిన వారందరికీ జూన్ 21 నుంచి ప్రారంభించిన టీకాల కార్యక్రమం విజయవంతమైందని తెలిపింది. ఆ రోజు నుంచి ఆరు రోజుల్లో రోజుకు సగటున 69 లక్షల డోసుల పంపిణీ జరిగింది. దాంతో, దేశంలో ఇప్పటివరకు పంపిణీ అయిన టీకా డోసుల సంఖ్య 32.17 కోట్లకు చేరింది. జూన్ నెలలో ఎస్‌ఐఐ నుంచి 45 బ్యాచ్‌ల్లో 10.80 కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకాలు కసౌలీలోని సెంట్రల్ డ్రగ్స్ లేబోరేటరీకి చేరాయని డిసిజిఐ తెలిపింది. ల్యాబ్ డైరెక్టర్ ప్రకాశ్‌సింగ్ మే నెలలో హోంమంత్రి అమిత్‌షాకు ఎస్‌ఐఐ ఉత్పత్తి సామర్థంపై సమాచారమిచ్చారు. మే నెలలో 6.5 కోట్లు, జూన్‌లో 9 నుంచి 10కోట్లమేర టీకా డోసులను ఎస్‌ఐఐ ఉత్పత్తి చేయగలదని అందులో పేర్కొన్నారు. అంచనాకు తగ్గట్టుగానే ఎస్‌ఐఐ నుంచి కొవిషీల్డ్ టీకాల ఉత్పత్తి జరిగిందని సింగ్ గుర్తు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News