Sunday, April 28, 2024

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతం

- Advertisement -
- Advertisement -

Six Maoists killed in encounter

మృతుల్లో నలుగురు
మహిళా నక్సల్స్
చత్తీస్‌గఢ్ తెలంగాణ
సరిహద్దుల్లో కాల్పులు
తప్పించుకున్న పలువురు
కీలక నేతలు?

n మృతుల్లో నలుగురు మహిళలు
n ఛత్తీస్‌గఢ్ , భద్రాద్రి జిల్లా సరిహద్దు అడవుల్లో కాల్పులు

మన తెలంగాణ/చర్ల : ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, అందులో నలుగురు మహిళా మావోయిస్టులున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకులు తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన వారి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

మావోయిస్టుల వ్యూహాన్ని తిప్పికొట్టిన పోలీసు బలగాలు

తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దులోని చర్ల—-కిష్టారంలోని పోలీసు బలగాలపై మావోయిస్టులు పెద్దఎత్తున్న దాడికి వ్యూహాన్ని రచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసు నిఘా వర్గాలు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక పోలీసు బలగాలతో కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ను నిర్వహించాయి. ఈ క్రమంలోని సోమవారం ఉదయం పోలీసులకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి.

కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో గాలింపు జరపగా మావోయిస్టులకు చెందిన రెండు 303 రైఫిళ్లు, మూడు డిబిబి ఎల్‌ఎస్ తుపాకులు, నాలుగు రాకెట్ లాంచర్లు లభించాయి. కాగా ఈ కాల్పుల సంఘటన సంచలనం కలిగించింది. ఇటీవల చర్ల ప్రాంతంలో ఓ సర్పంచ్‌ను కాల్చి చంపడం, మరో చోట ప్రెషర్‌బాంబు పేలుడుతో పోలీసులు సవాలు విసిరిన మావోయిస్టులకు పోలీసులు గట్టి ఎదురు దెబ్బ తీశారని భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, జిల్లా పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. ఎదురుకాల్పుల జరిగిన ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News