Saturday, April 27, 2024

పార్లమెంట్‌లో అదే ప్రతిష్టంభన

- Advertisement -
- Advertisement -

Six TMC MPs suspended from Rajya Sabha

ఎగువసభలో ఎంపిలపై వేటు
వెల్ ప్లకార్డులపై ఛైర్మన్ ఫైర్
లోక్‌సభలో గొడవ నడుమే బిల్లులు

న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్లకార్డు ప్రదర్శనలు, సభ్యులు వెల్‌లోకి దూసుకురావడం వంటి పరిణామాలపై సభాధ్యక్షులు ఎం వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తరచూ ఎంతగా చెపుతున్నా పట్టించుకోని తీరుపై ఆవేదన వెలిబుచ్చిన వెంకయ్యనాయుడు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కు చెందిన ఆరుగురు ఎంపీలపై ఒక్కరోజు బహిష్కరణ వేటు వేశారు. పెగాసస్ ఇతర అంశాలపై ప్రతిపక్షాలు బుధవారం కూడా సభలో నిరసనలకు దిగాయి. ఈ దశలో నినాదాలకు దిగుతూ వెల్‌లోకి ప్రతిపక్ష సభ్యులు దూసుకువెళ్లారు. ప్రతిపక్షాల సభ్యుల చేతుల్లోని ప్లకార్డులు, వాటిపై ప్రభుత్వ వ్యతిరేక స్లోగన్‌లు ఉండటం వంటి అంశాలపై ఛైర్మన్ అభ్యంతరం తెలిపారు. వెంటనే సభ్యులు తమతమ స్థానాలకు వెళ్లాలని లేకపోతే ప్లకార్డులు పట్టుకున్న వారిపై రూల్ 255ను ప్రయోగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే సభ్యులు ఆయన మాట పట్టించుకోలేదు. దీనితో ఉద్రిక్తుడైన ఆయన తన ఆదేశాలను పట్టించుకోని సభ్యులు, ఇప్పటికీ ప్లకార్డులు వీడని వారంతా సభ విడిచిపెట్టి పోవాల్సిందే, ఇది రూల్ 255 ప్రకారం అమలులోకి వస్తుందన్నారు.

ఈ సందర్భంగా సభ నుంచి వెళ్లిపోవాల్సిన సభ్యుల పేర్లతో రాజ్యసభ కార్యాలయం తరువాత జాబితా వెలువరిస్తుందని తెలిపారు. ఆ తరువాత వెలువడ్డ ప్రకటనలో టిఎంసికి చెందిన ఆరుగురు ఎంపీలు డోలా సేన్, మహ్మద్ నదిముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంత ఛెత్రి, అర్పిత ఘోష్, మౌసమ్ నూర్ పేర్లు మరుసటి రోజువరకూ సస్పెన్షన్ జాబితాలో ఉన్నారు. ఈ అంశానికి ముందు రాజ్యసభ సభ్యులుగా జవ్హర్ సర్కార్ ప్రమాణం చేశారు. వెంటనే సభాధ్యక్షులు రోజువారి అంశాలను సభ ముందు ఉంచారు. రైతుల ఉద్యమం గురించి ఎస్‌పి సభ్యులు రామ్ గోపాల్ యాదవ్, విశ్వంభర్ ప్రసాద్ నిషాద్‌లు రూల్ 267 పరిధిలో చర్చకు ఇచ్చిన నోటీసునుతాము అనుమతించడం లేదని వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే ఈ విషయంపై చర్చకు ఇతర నిబంధనల పరిధిలో అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. పెగాసస్ స్నూపింగ్ చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు బుధవారం లోక్‌సభలో నిరసనలు కొనసాగించారు. దీనితో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ నడుమనే రెండు బిల్లుల ఆమోదం తరువాత గురువారానికి సభ వాయిదా పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News