Monday, April 29, 2024

స్పైస్‌జెట్ రూ.2,250 కోట్ల సమీకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన బడ్జెట్ విమానయా సంస్థ స్పైస్‌జెట్ నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా దాదాపు రూ.2,250 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది. ఆర్థిక సంస్థలు, ఎఫ్‌ఐఐలు, హెచ్‌ఎన్‌ఐలు, ప్రైవేట్ ఇన్వెస్టర్‌లకు షేర్లు, వారెంట్‌లను జారీ చేయడం ద్వారా ఈ మూలధనం సమీకరించనుంది. బకాయిలు చెల్లించకపోవడంపై అనేక చట్టపరమైన కేసులను ఎదుర్కొంటున్నందున స్పైస్‌జెట్‌కు ప్రస్తుతం అత్యవసరంగా నగదు అవసరం ఉంది.

ప్రతిపాదన ప్రకారం, స్పైస్‌జెట్ 13 కోట్ల కన్వర్టబుల్ వారెంట్లను, 32.08 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను యూనిట్‌కు రూ. 50 చొప్పున జారీ చేస్తుంది. ఇష్యూలో ఎలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, ఏరీస్ ఆపర్చునిటీస్ ఫండ్, మహాపాత్ర యూనివర్సల్ లిమిటెడ్, నెక్సస్ గ్లోబల్ ఫండ్, ప్రభుదాస్ లిల్లాధర్, రెసొనెన్స్ ఆపర్చునిటీస్ ఫండ్ వంటి పెట్టుబడిదారులు ఉంటారు. ఈ వార్తల తర్వాత మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్లు దాదాపు 4.18 శాతం నష్టపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News