Friday, May 17, 2024

ఎమోషన్స్ ఎప్పటికీ గుర్తుంటాయి

- Advertisement -
- Advertisement -

కిరణ్ అబ్బవరం హీరోగా, ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీధర్ గాదె దర్శకత్వంలో ప్రమోద్, రాజులు నిర్మిస్తున్న చిత్రం ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “సంగీత దర్శకుడు భరద్వాజ్ అద్భుతమైన మంచి పాటలు ఇచ్చాడు. చుక్కల చున్నీ, చూశారే కళ్ళారా, సిగ్గెందుకు రా మామ పాటలకు మంచి స్పందన వచ్చింది. ఒక మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇక మధ్యతరగతి వారు అన్ని సాధించాలి, దేనికీ భయపడ కూడదు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశాము. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఎమోషన్స్ ఎప్పటికీ గుర్తుంటాయి. ఖచ్చితంగా మా సినిమా అందరికీ నచ్చుతుంది”అని అన్నారు.

SR Kalyana Mandapam movie release tomorrow

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News