Monday, April 29, 2024

దేశంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో, ఎదిర సమీపంలో పి.ఎ.సి.ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… దేశంలో రైతులంటే ప్రేమ ఉన్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని, తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని మంత్రి తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ స్థాయి రైతు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత 24 గంటల కరెంటు సరఫరా, రైతు కళ్లాలలోనే ధాన్యం కొనుగోలు తదితర కార్యక్రమాలు బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు… తర్వాత రైతుల జీవన పరిస్థితుల్లో వచ్చిన మార్పును గమనించాలని మంత్రి కోరారు. ధాన్యం కొనుగోలులో మహిళా సంఘాలు చైతన్యవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News