Monday, April 29, 2024

డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరపాల్సిందే

- Advertisement -
- Advertisement -

Supreme Court Backs UGC Decision

 

న్యూఢిల్లీ: డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. సెప్టెంబర్ 30 లోగా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్రాలు, యూనివర్సిటీలు విద్యార్థులను ప్రమోట్ చేయలేవని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలను నిర్వహించాలన్న యుజిసి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సెప్టెంబర్ 30 లోగా పరీక్షలు నిర్వహించడం తమకు సాధ్యం కాదని ఏ రాష్ట్రమైన భావించిన పక్షంలో పరీక్షల నిర్వహణకు గడువు పొడిగించాలని కోరుతూ యుజిసిని ఆశ్రయించవచ్చని జసిటస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షలు నిర్వహణపై యుజిసి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శివసేన యువజన విభాగమైన యువసేనతో సహా వివిధ సంస్థలు, వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేశాయి.

Supreme Court Backs UGC Decision

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News