Monday, April 29, 2024

సుప్రీం కోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

Supreme Court strikes down 10.5 per cent reservation

వన్నియార్ రిజర్వేషన్ చెల్లదని తీర్పు

న్యూఢిల్లీ : తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గట్టి షాకిచ్చింది. వన్నియార్ కమ్యూనిటీకి కేటాయించిన 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్ చెల్లదని , అందుకోసం రూపొందించిన చట్టాన్ని రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వన్నియార్ కమ్యూనిటీకి 10.5 శాతం రిజర్వేషన్లు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చింది. ఈమేరకు 2021 లో ప్రత్యేక చట్టం తెచ్చింది. అయితే ఓబీసీ కోటాలో ఈ రిజర్వేషన్ రాజ్యాంగ బద్ధం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబిసి) కోసం 20 శాతం కోటా ఉండగా, అందులో 10.5 శాతం వన్నియార్ కమ్యూనిటీకి వర్తింప జేస్తూ 2021 తమిళనాడు యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఇందులో అభ్యంతరాలు వ్యక్తం కాగా, తమిళనాడు యాక్ట్ 2021 ను కొట్టేస్తూ అంతకు ముందు మద్రాస్ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. తాజాగా చట్టాన్ని రద్దు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే సుప్రీం కోర్టు సమర్ధించింది. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్ నేతృత్వం లోని సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News