Sunday, April 28, 2024

తమిళ నటుడు- దర్శకుడు మనోబాల కన్నుమూత

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మనోబాల బుధవారం కాలేయ సంబంధ వ్యాధితో మరణించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. గత 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మనోబాలను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. హాస్య నటుడిగా తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటులందరితో పనిచేసిన మనోబాల తన సినీ జీవితాన్ని 1979లో దర్శకుడు భారతీరాజాకు అసిస్టెంట్‌గా పుదియా వార్పుగళ్ చిత్రంతో ప్రారంభించారు.

Also Read: ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో 162వ స్థానంలో భారత్: 150వ స్థానంలో పాక్

200 చిత్రాలకు పైగా నటించిన మనోబాల 24 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1982లో ఆగాయ గంగై చిత్రంతో దర్శకుడిగా ఆయన మారారు. కార్తీక్, సుహాసిని ఈ చిత్రంలో నటించారు. రజనీకాంత్ హీరోగా నటించిన ఊర్‌కావలన్(1987) చిత్రానికి ఆయనే దర్శకుడు. మోహన్ హీరోగా పిల్లై నిలా(1985), విజయకాంత్‌తో ఎనక్కు మట్టుంతాన్(1989) చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. గజిని, అభీయుం నానుం, తుపాకీ చిత్రాలలో ఆయన పాత్రలు విశేష జనాదరణ పొందాయి.

Also Read: సరిగమ సౌత్ చేతికి ‘ఖుషీ’ మూవీ ఆడియో రైట్స్

ఘోస్టీ, కొండ్రాల్ పావమ్ చిత్రాలు ఆయన నటుడిగా ఆయన చివరి చిత్రాలు. ఆయన భార్య, కుమారుడు ఉన్నారు. మనోబాల మృతి పట్ల తమిళ చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్, కార్తీ, జివి ప్రకాశ్ కుమార్, మంచు మనోజ్ తదితర ప్రముఖులు మనోబాల మృతికి సంతాపం ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News