Sunday, April 28, 2024

రాజుకున్న బర్తరఫ్ వివాదం

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడులో కీలక మంత్రి సెంథిల్ బాలాజీని గవర్నర్ ఆర్‌ఎన్ రవి బర్తరప్ చేసిన ఉదంతం తీవ్రస్థాయి రాజకీయ దుమారానికి దారితీసింది. గవర్నర్ రవి , సిఎం స్టాలిన్ మధ్య పరస్పర లేఖాలు అస్త్రాలుగా సాగాయి. గవర్నర్ రవి ముఖ్యమంత్రికి శుక్రవారం రాసిన లేఖలో తన చర్యను సమర్ధించారు. అంతా పద్ధతి ప్రకారం జరిగిందని తెలిపారు. అవినీతి ఆరోపణలతో జైలుపాలయినమంత్రిని అనివార్యంగా బర్తరఫ్ చేయాల్సి వస్తోందని గురువారం సాయంత్రం 7గంటలకు లేఖ పంపించిన గవర్నర్ ఆ తరువాత అర్థరాత్రి వేళ ఈ లేఖను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు తెలిపారని సిఎం స్టాలిన్ పేర్కొన్నారు. గవర్నర్‌కు తమిళంలో నమస్కారాలు తెలియచేస్తూ రెండు వైరుద్ధ లేఖల్లో కూడా విధివిధానాల పట్ల అనుచిత ధోరణి వ్యక్తం అయిందని తెలిపారు.

చట్టం నిబంధనలు వాస్తవికతల గురించి పట్టించుకోకుండా వ్యవహరించారని స్టాలిన్ ఈ లేఖలో మండిపడ్డారు. ఏది ఏమైనా మంత్రిని బర్తరఫ్ చేయడం అనేది కేవలం సిఎం , కేబినెట్ సమిష్టి నిర్ణయం తరువాతి సిఫార్సు తరువాత గవర్నర్ తీసుకోవల్సి ఉంటుంది. అంతేకాని గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించడం కుదరదనే విషయం గతంలో ఇటువంటి సందర్భాలలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లోనూ వ్యక్తం అయిందని తెలిపారు. ప్రజల ద్వారా ఎన్నికైన ముఖ్యమంత్రికే మంత్రుల బర్తరఫ్ అధికారం సంపూర్ణంగా ఉంటుంది, ఇందులో గవర్నర్ పాత్ర లేదని , దీనిని గుర్తుంచుకోవాలని గవర్నర్‌కు గుర్తు చేశారు. తొలి వర్తమానంలో మంత్రిని తొలిగించడం గురించి ఘాటుగా సమర్థించుకోవడం, రాష్ట్రంలో తీవ్రస్థాయి అవినీతి ఉందని, దీనిని మంత్రి మండలి కొనసాగిస్తోందనే వాదన ఉందని, తరువాతి లేఖలో అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుంటున్నామని ,

పైగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు నిర్ణయం పక్కకు పెడుతున్నట్లు తెలిపారని, నిజానికి అధికారం లేని పనికి దిగిన వ్యక్తి ద్వారా జరిగిన పనికి విలువ లేదని తాము భావిస్తున్నామని తెలిపారు. తమ మంత్రి మండలిలో ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదనే అధికారం పూర్తిగా ప్రధాన మంత్రి లేదా ముఖ్యమంత్రి నిర్ణయాధికారంపై ఆధారపడి ఉంటుందని 2013 సంవత్సరంలో లిలీ థామస్ / కేంద్ర ప్రభుత్వం మధ్య సాగిన వ్యాజ్యం తరువాత వెలువడిన తీర్పులో సుప్రీంకోర్టు తెలిపిందని స్టాలిన్ వెల్లడించారు. మరి ఇటువంటి విషయాలు తెలుసుకోకుండా గవర్నర్ వ్యవహరించడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News