Monday, April 29, 2024

తమిళనాడు మంత్రి పొన్ముడికి సతీసమేతంగా మూడేళ్ల జైలుశిక్ష

- Advertisement -
- Advertisement -

చెన్నై: అక్రమాస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మత్రి కె పొన్ముడికి మద్రాసు హైకోర్టు గురువారం మూడేళ్ల కారాగార శిక్ష విధించింది. పొన్ముడి భార్య విశాలాక్షికి కూడా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి జయచంద్రన్ గురువారం తీర్పు వెలువరించారు. అవినీతి నిరోధక చట్టం కింద మంత్రికి, ఆయన భార్యకు జైలు శిక్షతోపాటు రూ. 20 లక్షల చొప్పున జరిమానా కూడా న్యాయమూర్తి విధించారు. జైలు శిక్ష అనుభవించడానికి పొన్ముడి 30 ప్రత్యేక కోర్టు ఎదుట లొంగిపోవాలని జస్టిస్ జయచంద్రన్ తన ఉత్తర్వులలో ఆదేశించారు. 2024 జనవరి 22 లోగా ఆ దంపతులు లొంగిపోని పక్షంలో వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు వారెంట్ జారీచేఆలని న్యాయమూర్తి తన ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా..హైకోర్టులో హాజరైన పొన్ముడి, ఆయన భార్య విశాలాక్షి తమ వైద్య నివేదికలను కోర్టుకు సమర్పిస్తూ తమ వయసును, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కనిష్ఠ జైలు శిక్ష విధించాలని అర్థించారు.

మూడేళ్ల జైలు శిక్ష పడడంతో 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన పొన్ముడి ఆటోమేటిక్‌గా తన శాసనభ్యత్వాన్ని కోల్పోతారు. కోర్టు తీర్పును పురస్కరించుకుని ఆయన ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులవుతారు. 72 ఏళ్ల పొన్ముడి తిరిగి రాజకీయ జీవితంలోకి ప్రవేశించే అవకాశాలు లేవని వర్గాలు తెలిపాయి. 2006 నుంచి 2011 వరకు ఉన్నత విద్యాశాఖ, గనులు, ఖనిజాల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని పొన్ముడిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆదాయానికి మించి రూ. 1.72 కోట్ల ఆస్తులు ఆయన కలిగి ఉన్నట్లు ఆరోపణలు నమోదయ్యాయి. యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేసిన పొన్ముడి రాజకీయాలలోకి ప్రవేశించి డిఎంకె వ్యవస్థాపకుడు ఎం కరుణానిధికి సన్నిహిత సహచరుడిగా ఎదిగారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు కూడా పొన్ముడి సన్నిహితుడు. తమిళనాడు శాసనసభలో అనర్హత వేటుకు గురైన రెండవ వ్యక్తి పొన్ముడి. గతంలో బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్షతో శాసనసభ్యత్వాన్ని ముఖ్యమంత్రి జె జయలలిత కోల్పోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News