Monday, April 29, 2024

వరంగల్‌లో కల్తీ టీ పొడి పట్ల టాటా టీ జెమిని అవగాహన కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

TATA Tea Gemini awareness drive in Warangal

వరంగల్‌: తెలంగాణలో సుప్రసిద్ధ టీ బ్రాండ్‌లలో ఒకటైన టాటా టీ జెమిని ఇప్పుడు రసాయన రంగులను తయారుచేస్తున్న టీల వల్ల కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహన కలిగించేందుకు ఓ కార్యక్రమం ప్రారంభించింది. ఇప్పటికే జనగాం, కరీంనగర్‌లలో చేసిన ఒగ్గు కథ షో అపూర్వవిజయం సాధించడంతో దానిని ఇప్పుడు వరంగల్‌కు తీసుకువచ్చింది. ఒగ్గు కళాకారులు భారీ సంఖ్యలో ప్రజలను ఆకర్షించడంతో పాటుగా కల్తీ టీ సేవించడం వల్ల కలిగే నష్టాలు, బ్రాండెడ్‌ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించారు.

వినియోగదారులకు కల్తీల పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా ఆ రకమైన పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలను గురించి వెల్లడిస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది టాటా టీ జెమిని. ఆ క్రమంలోనే తెలుగు సంస్కృతి లో అంతర్భాగమైన ఒగ్గుకథ ద్వారా ఇప్పుడు కల్తీల పట్ల ప్రచారం చేస్తోంది. ప్రాంతీయ స్ధాయిలో ఈ బ్రాండ్‌ ఇప్పుడు ఇంటింటికీ అవగాహన కల్పించడంతో పాటుగా ‘కోల్డ్‌ వాటర్‌ టెస్ట్‌ ’ సైతం చేయడం ద్వారా టీ కల్తీని గుర్తించేలా తోడ్పడుతుంది. ఒక లక్ష ఇళ్లలో ఈ పరీక్షలను చేయాలని లక్ష్యంగా చేసుకోగా ఇప్పటికే తెలంగాణాలో 30వేలకు పైగా ఇళ్లలో ఈ పరీక్షలు చేశారు.

ఈ కార్యక్రమం గురించి టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ ప్రెసిడెంట్‌ – ప్యాకేజ్డ్‌ బేవరేజస్‌, ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా పునీత్‌ దాస్‌ మాట్లాడుతూ ‘‘తెలంగాణాలో అగ్రగామి ప్యాకేజ్డ్‌ టీ బ్రాండ్‌ టాటా టీ జెమిని. కల్తీ, లూజ్‌ టీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నాము. తెలంగాణాలో ఈ తరహా టీ ప్రభావం ప్రబలంగా ఉంది. ఈ సందేశం ప్రభావవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రాంతీయ జానపద కళారూపం ఒగ్గు కథను ఆలంబనగా చేసుకుని గ్రామీణుల నడుమ కల్తీ టీ సేవనం వల్ల కలిగే నష్టాలను వెల్లడిస్తున్నాము’’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News