Saturday, April 27, 2024

దళిత, గిరిజనులకు దండిగా అవకాశాలు

- Advertisement -
- Advertisement -

Telangana government is committed to development of Dalits and tribals

 

పారిశ్రామిక వేత్తలుగా
ఆయా వర్గాల యువకులు
2000 మందికి రూ.100 కోట్ల
సబ్సిడీ చెక్కులు
జిల్లాల్లో అవగాహన మేళాలు
సిఎం కెసిఆర్ ఆలోచన మేరకు
ఎస్‌సి ఎస్‌టి కమిషన్ పనితీరు
భేష్ : మంత్రి కెటిఆర్
కమిషన్ వెబ్‌సైట్, నూతన
సమావేశ మందిరాన్ని
ప్రారంభించిన మంత్రులు
కెటిఆర్, కొప్పుల, సత్యవతి

మనతెలంగాణ/హైదరాబాద్ : తమ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పురపాలక,ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. ఇప్పటికే అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రెండు వర్గాలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతున్నదని తెలిపారు. ఒకవైపు వారి ప్రాథమిక అవసరాలైన విద్యా రంగంలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూనే, మరోవైపు వారి అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బుధవారం ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ కార్యాలయంలో వివిధ శాఖల సెక్రటరీలు,ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్‌లతో కలిసి మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరంతోపాటు, వెబ్‌సైట్‌ను ఇతర మంత్రులతో కలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. సూమారు 2000 మందికి అవసరం అయిన 100 కోట్ల సబ్సీడీ మెత్తాన్ని పరిశ్రమల శాఖ తరపున విడుదల చేసిన కెటిఆర్ పలువురు లబ్దిదారులను మంత్రులు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎస్‌సి,ఎస్‌టిల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కెటిఆర్ తన ఆలోచనలను పంచుకున్నారు.

దేశంలో కులాన్ని మూలధనంతోనే రూపుమాపే అవకాశం ఉన్నదని, ఆ దిశగా సాధ్యమైనంత ఎక్కువ మంది దళిత, గిరిజన వర్గాల నుంచి యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కెటిఆర్ అన్నారు. ఇప్పటికే టి-ప్రైడ్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఈ రెండు వర్గాల యువకులకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. రెండు వర్గాల్లో కలిపి ఇప్పటికే సుమారు 36 వేల మందిని జౌత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు యూనిట్లు ఇచ్చామని తెలిపారు. వీరందరికి త్వరలోనే సబ్సీడీలను అందిస్తామన్నారు. సమాజంలో ఉన్న వారు, లేనివారు అనే తేడానే ప్రధానంగా మారిందని, ఆర్థికంగా అవకాశాలు లేని వారికి అవకాశాలు కల్పించే విధంగా పని చేస్తామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఎడ్యుకేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్, ఎంప్లాయిమెంట్ అనే 3 ఈ సూత్రంతో నిమ్న వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టిన భారీ ప్రాజెక్టులు, ఇతర పాలనా సంస్కరణ కార్యక్రమాలతో దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని తెలిపారు. దళిత, గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా, పెట్టుబడి అవకాశాలు కల్పించే విషయంలోనూ అంతే ఆదర్శంగా ఉండాలన్నారు.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అవలంభిస్తున్న కార్యక్రమాలు, చర్యలను పునః సమీక్షించి, దేశంలో ఇతర రాష్ట్రాల అవలంభిస్తున్న కార్యక్రమాలన్నింటి పైన అధ్యయనం చేసి దేశంలోనే ఆదర్శవంతమైన విధానంతో ముందుకు రావాలని అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. తన పరిధిలో ఉన్న పరిశ్రమల శాఖ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్‌సి కార్పొరేషన్‌లు కలిసి ఈ దిశగా పని చేయాలన్నారు. త్వరలోనే మరో సారి సమావేశమవుతామని అధికారులకు సూచించారు. అలోగా వినూత్నమైన విధానాలతో ముందుకు వస్తే ముఖ్యమంత్రి అనుమతితో మరింత ప్రభావవంతమైన పాలసీలతో ముందుకు పోదామని చెప్పారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పథకాలు, కార్యక్రమాల ద్వారా దళిత, గిరిజన యువకులకున్న అవకాశాలపైన అన్ని జిల్లాల్లో అవగాహన మేళాలు నిర్వహించాలన్నారు. ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ ఏర్పడిన నాటి నుంచి చేపట్టిన చర్యలను మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా అభినందించారు.

గతంలో కమిషన్లు ఉన్నా మొక్కుబడిగా ఉండేవని, రాజకీయ నాయకుల పునరావాసంగా ఉండేవని అన్నారు. కానీ సిఎం కెసిఆర్ ఆలోచన మేరకు ప్రస్తుతం ఈ కమిషన్ పని చేయడం సంతోషంగా ఉందన్నారు. కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉన్న 92 శాతం కేసులను పరిష్కరించడం, జిల్లాల్లో పర్యటించడం వంటి చర్యలతో కమిషన్ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. తాజాగా బిసి కమిషన్ కూడా 17 సంచార జాతులను గుర్తించి వారిని జాబితాలో చేర్చాలని ప్రతిపాదించడం గొప్ప విషయమన్నారు. స్పృహ ఉన్న నాయకులు, సామాజిక బాధ్యత ఉన్న నాయకులు మంచి స్థానాల్లో ఉంటే ఎంత గొప్పగా పని చేస్తారనే దానికి ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ పనితీరు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ ఛైర్మన్, సభ్యులను అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ ప్రతి ఒక్కరు సంతోషంగా సిఎం కెసిఆర్ ఉండాలని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో సమైక్య రాష్ట్రంలో ఎస్‌సి,ఎస్‌టి కమిషన్‌కు కనీస వసతులు లేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దేశంలోనే ఏ కమిషన్‌కు లేని విధంగా అన్ని హంగులతో కూడిన కార్యాలయం తమకున్నదని అన్నారు. ఈ సందర్భంగా కమిషన్ చేపట్టిన కార్యక్రమాలను ఛైర్మన్ మంత్రులకు వివరించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిలు తమకు అన్యాయం జరిగితే నేరుగా కమిషన్‌కు వస్తున్నారని, ఇందుకు తాము చాలా గర్విస్తున్నామన్నాని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు దగ్గర కావడం, కమిషన్ ద్వారా వారికి న్యాయం చేయడం, ప్రయోజనాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, అధికారులు కమిషన్‌కు భాగా సహకరిస్తున్నారని అన్నారు. భవిష్యత్‌లో కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయం మేరకు రాష్ట్రంలోని దళిత, గిరిజన వర్గాలకు ఈ కమిషన్ ద్వారా పూర్తి న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఐటిడిఎలలో ప్రి ఇంక్యుబేషన్, రీ ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటుకు ట్రైకార్, వి.హబ్ ఒప్పందం జరిగింది. దీంతో గిరిజన పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తారు. నేషన్ షెడ్యూల్ క్యాస్ట్ పైనాన్స్ డవలప్‌మెంట్ కార్పోరేషన్ ఇచ్చే రుణాలకు సంబందించి తెలంగాణ యస్‌యప్‌సికి వంద కోట్ల బ్యాంకు గ్యారంటీకి సంబంధించిన పత్రాలను మంత్రులు అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News