Saturday, April 27, 2024

ధాన్యంలో మనమే ధనికులం

- Advertisement -
- Advertisement -

 

దేశవ్యాప్తంగా 45 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
ఇందులో తెలంగాణ వాటా 34.36లక్షల టన్నులు
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరేళ్ల ప్రణాళికలకు ఇది తార్కాణం
10లక్షల టన్నులతో రెండో స్థానంలో ఎపి

ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉంది. దేశంలో ఇప్పటికే 50లక్షల టన్నులు సేకరించగా అందులో తెలంగాణ వాటా 34.36 లక్షల టన్నులు. ఎపి నుంచి 10లక్షల టన్నులు కొనుగోలు చేశాం. యాసంగిలోనే ఇంత పెద్ద ఎత్తున ధాన్యం పండితే ఇక వర్షాకాలంలో ఇంకా ఏ మేరకు పోటెత్తుతుందో అన్న దానిపై అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ధాన్యాగారంగా అవతరిస్తుండడంతో రైతులు ఆనందంగా ఉన్నారు.

                                                                        – రాం విలాస్ పాశ్వాన్ కేంద్ర మంత్రి

ధాన్యం సేకరణలో రాష్ట్రం మొదటి స్థానాన్ని ఆక్రమించడం తెలంగాణ రైతులు, ప్రజలు గర్వించదగ్గ విషయం. కాళేశ్వరం ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులు నిండు కుండలను తలిపిస్తుండడంతో రైతుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. సిఎం కెసిఆర్ వ్యవసాయ రంగం అభివృద్ధికి నిరంతరం చేస్తున్న కృషి ఫలితాలివి. దీంతో తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా అవతరిస్తోంది. దానికి కేంద్రమంత్రి పాశ్వాన్ ప్రకటనే నిదర్శనం.

                                                                                              – మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానాన్ని దక్కించుకుంది. దీంతోపాటు ఎన్నడూ లేనంతగా ఈ సారి భూగర్భ జలాలు పైకి రావడం కూడా రాష్ట్ర ప్రజలు సంతోషించదగ్గ విషయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రెండూ శుభ సంకేతాలు సిఎం కెసిఆర్ పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చని ప్రజలు పేర్కొంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలోనే కెసిఆర్ సారథ్యంలోని తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతికి దీనిని నిర్వచనంగా చెప్పవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2014-15లో కేవలం వరి సాగు 34.96 లక్షల ఎకరాల్లో ఉండగా 2019-20 సంవత్సరానికి వచ్చే సరికి ఇది 68.50 లక్షల ఎకరాలకు చేరింది. వరిధాన్యం దిగుబడి 2016-17లో కోటి టన్నులు రాగా ఈ ఏడాది కోటిన్నర టన్నులకు చేరింది. ఖరీఫ్, రబీ సీజన్లు అనే తేడా లేకుండా ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చని వరి పంట కనువిందు చేస్తో ంది. 201819 ఖరీఫ్ సీజన్‌లో ఏకంగా 61 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి రాగా, 2017- 18 ఖరీఫ్ సీజన్‌లో వరి దిగుబడి 30.42 లక్షల టన్నులుగా ఉందని, ఈ ఏడాది ఖరీఫ్ లో దిగుబడి పెరగడంతో పాటు సాగువిస్తీర్ణం కూడా పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.

రాష్ట్రాల నుంచి 10 లక్షల టన్నుల సేకరణ

తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారత ఆహారసంస్థ రికార్డు స్థాయిలో బియ్యాన్ని తెలంగాణ పౌర సరఫరాల శాఖ నుంచి సేకరించనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 45 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, ఇందులో తెలంగాణ వాటాగా 34.36 లక్షల టన్నులు కావడంతో తెలంగాణకు మొదటిస్థానం దక్కింది. రెండోస్థానం ఆంధ్రప్రదేశ్ దక్కించుకోగా, ఈ రాష్ట్రం నుంచి పది లక్షల టన్నులను కేం ద్ర సేకరించింది. దేశంలోని మిగతా రాష్ట్రాల నుంచి సేకరించింది కేవలం అయిదు లక్షల టన్నులేనిని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరం ఎపి నుంచి 32.30 లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరించగా, తెలంగాణ 31.56 ధాన్యాన్ని సేకరించిం ది. యాసంగిలో తెలంగాణ సాధించిన వరిధాన్యం దిగుబడి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఇది అందరి దృష్టిని ఆకర్శిస్తోంది.

తెలంగాణ రాష్ట్రం వస్తే ఎడారే అన్న అప్పటి పాలకుల ముఖంమీద కొట్టినట్టుగా కెసిఆర్ జవాబు ఇచ్చారని పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, రైతన్నలు పేర్కొంటున్నారు. సాగునీటి ప్రాజెక్టులు సాకారమవుతున్నాయి. కాలువలు పారుతున్నాయి. చెరువులు నిండుతున్నాయి. భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. నీటి వనరులు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ యాసంగిలో ధాన్యం దిగుబడి పెరగడానికి కారణాలయ్యాయి. ధాన్యం కొనుగోళ్లలో కూడా తెలంగాణ రాష్ట్రమే ముందుంది. ఆ ధాన్యాన్ని ఎఫ్‌సిఐకి అందజేయడంలో కూడా మనమే టాప్‌లో నిలిచాం. యాసంగి సీజన్‌లో తెలంగాణలో దాదాపు 90 లక్షల ధాన్యం పండే అవకాశం ఉందని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. తెలంగాణ చరిత్రలో ఈ స్థాయిలో ధాన్యం పండించడం ఇదే మొదటిసారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కాళేశ్వరం, మిషన్ కాకతీయ.. గొలుసుకట్టు చెరువుల ఫలితం

ఇక కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ గొలుసుకట్టు చెరువుల ఫలితంగా భూగర్భ జలమట్టాలు యేటికేడు పెరుగుతూ వస్తున్నాయి. అన్నదాతల్లో ఆనందం నింపుతున్నాయి.. పాతాళగంగ పైపైకి వచ్చేస్తోంది. భూగర్భ జలమట్టాలు పెరుగు తున్నాయి. రాష్ట్రంలో అధికవర్షపాతం, మిషన్ కాకతీయ, గొలుసుకట్టు చెరువులు, కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భంలో జలమట్టాలు ప్రతియేటా అంతకంతకూ పెరగడం అన్నదాతల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇదంతా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషేనని అన్నదాతలు పేర్కొంటున్నారు. ఆ దార్శనికుడి ప్రయత్నంతో మిషన్ కాకతీయతో పాడుబడిన చెరువులకు జలకళను తెప్పించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లు, వాటి ద్వారా చెరువులు నింపి భూగర్భజలాల మట్టాన్ని పెంచేందుకు పాటుపడ్డారని పార్టీ వర్గాలు, రైతన్నలు పేర్కొంటున్నారు. వేసవి సీజన్‌లో పలు జిల్లాల్లో జలమట్టాలు గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే బాగా పెరిగాయి. నీటి సంవత్సరాన్ని సాధారణంగా జూన్ నుంచి మరుసటి ఏడాది మే వరకు లెక్కిస్తారు. ఆ లెక్కన 2019 జూన్ నుంచి 2020 ఏప్రిల్ వరకు రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు ఎలా ఉన్నాయన్న దానిపై భూగర్భ జలశాఖ 966 చోట్ల అధ్యయనం చేసింది. అంతేకాదు మొత్తం 13 జిల్లాల్లో సాధారణం కన్నా 23 నుంచి 46 శాతం దాకా అధిక వర్షపాతం నమోదైనట్టు ఈ అధ్యయనంలో గుర్తించింది. రాష్ట్రంలో సగటున 11.05 మీటర్ల లోతున భూగర్భ జల మట్టాలుండగా, వనపర్తి జిల్లాలో 4.66 మీటర్ల లోతున, మెదక్ జిల్లాలో 22.12 మీటర్ల కింద నీరుంది.

ఆకుపచ్చ వర్ణాన్ని సంతరించుకుంటున్న రాష్ట్రం

2019 ఏప్రిల్‌తో పోలిస్తే 2020 ఏప్రిల్‌లో సగటున రాష్ట్రంలో 3.09 మీటర్ల వరకు భూగర్భ జల మట్టాలు పెరిగాయి. మొత్తంగా తెలంగాణ ఆకుపచ్చవర్ణాన్ని సంతరించుకుంటోందని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం రాష్ట్ర సాధారణ వర్షపాతం 877 మిల్లీమీటర్లకు గాను 1,011మి.మీలుగా నమోదయ్యింది. అత్యధికంగా ములుగు జిల్లాలో 1,632 అత్యల్పంగా, జోగులాంభ గద్వాలలో 530 మి.మీల వర్షపాతం నమోదయ్యింది. రాష్ట్రంలో 8 శాతం భూభాగంలో కనీసం 20 మీటర్ల లోతుకెళితే తప్ప నీటి జాడ కనిపించడం లేదని ఈ అధ్యయనంలో తేలింది. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, మెదక్ తదితర జిల్లాలకు చెందిన ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News