Friday, May 17, 2024

విఎఫ్ఎక్స్ ఔట్ సోర్సింగ్ లో తెలంగాణ వాటా పెద్దది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

Minister KTR inaugurates india joy 2021 at hicc

హైదరాబాద్: విఎఫ్ఎక్స్ ఔట్ సోర్సింగ్ లో తెలంగాణ వాటా చాలా పెద్దదని ఐటి శాఖ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. జాయ్-2021 కార్యక్రమాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.  హెచ్ఐసిసిలో ఇండియా జాయ్-2021 కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. గత రెండేళ్లలో హైదరాబాద్ లో పది కొత్త విఎఫ్ఎక్స్ సంస్థలు కొలువుదీరాయని ప్రశంసించారు. ప్రస్తుతం భాగ్యనగరంలో 80 విఎఫ్ఎక్స్ సంస్థలు ఉన్నాయని, ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా హైదరాబాద్ లో అనేక గేమ్స్ రూపొందాయని, 2023 మార్చిలోగా ఇమేజ్ టవర్ ప్రారంభించేలా కృషి చేస్తామని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, నటుడు సుధీర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News