Monday, April 29, 2024

ఆరోగ్య ఛాంపియన్

- Advertisement -
- Advertisement -

Telangana ranks third in the 4th Health Index

నీతి ఆయోగ్ సూచీలో తెలంగాణకు మూడో స్థానం

గతేడాదితో పోలిస్తే మరోమెట్టెక్కిన రాష్ట్రం హెల్త్ సేవల్లో పురోగమిస్తున్న
రాష్ట్రాల జాబితాలో మొదటిస్థానం తలసారి ఖర్చులో మూడోస్థానం ఆఖరి
స్థానంలో మొదటి రెండు స్థానాల్లో కేరళ, తమిళనాడు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సాధించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం దిశగా అడుగులు వేస్తున్నామని మరోసారి రుజువైంది. నీతి ఆయోగ్ సోమవారం విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్స రంలో అన్ని రాష్ట్రాల్లో వైద్యారోగ్య రం గం పురోగతిని నీతి అయోగ్ విశ్లేషించి నివేదిక రూపొందించింది. 2018-19లో తెలంగాణ 4వ స్థానంలో ఉండ గా, 2019-20లో మూడో స్థానానికి చేరింది. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కేరళ మొదటి స్థానంలో, తమిళనాడు రెండో స్థానంలో నిలువగా తెలంగాణ మూ డో స్థానంలో నిలిచింది. ఆరోగ్యం రం గంలో పురోగమిస్తున్న రాష్ట్రంగా మొ దటి స్థానంలో నిలిచింది. ముఖ్యమం త్రి కెసిఆర్ మొదటి నుంచి ప్రజారోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి.. ప్రభుత్వ ద వాఖానలను బలోపేతం చేస్తున్న విష యం తెలిసిందే. అన్ని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, నాణ్య మైన వైద్యం అందిం చేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని చెప్పడా నికి ఈ ర్యాంకు నిదర్శనం.

అనేక అంశాల్లో తెలంగాణ మెరుగుపడిందని నీతి అయోగ్ వ్యాఖానించింది. మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరీలో తెలంగాణ మొదటి స్థానంలో నిలి చింది. 2018-19 నుంచి 2019-20 మధ్య కాలంలో రాష్ట్రాల్లో ఆరోగ్య స్థితిగతులపై అధ్య యనం చేసి ‘ఆరోగ్యకరమైన రాష్ట్రాలు, ప్రగతిశీల భారత దేశం’ అనే శీర్షికతో నీతి అయోగ్ ఈ నివేదిక ర్యాంకింగ్‌ను ‘పెద్ద రా ష్ట్రాలు’, ‘చిన్న రాష్ట్రాలు’, పాలి త ప్రాంతాలు’ గా వర్గీకరించారు. పెద్ద రాష్ట్రాల్లో వార్షిక పెం పుదల పనితీరు పరం గా, ఉత్తరప్రదేశ్, అ స్సాం, తెలంగాణ మొదటి మూడు రా ష్ట్రాల ర్యాంకింగ్‌లో నిలిచాయి. తలసరి వైద్యంపై తెలంగాణ పెద్ద మొత్తంలో ఖర్చుచేస్తున్నదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఇటీవల రాజ్యసభలో తెలిపింది. ప్రజా వైద్యంపై ప్రభుత్వాలు చేస్తున్న తలసరి ఖర్చు విషయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదని వెల్లడించింది. ఒక్కో వ్యక్తిపై చేస్తున్న తలసరి ఖర్చు రూ. 1,698 గా ఉన్నది. హిమాచల్ ప్రదేశ్, కేరళ తర్వాత తెలంగాణ నిలిచింది.

హెల్త్ ఛాంపియన్‌గా తెలంగాణ..

ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 13 వరకు “హెల్దీ అండ్ ఫిట్ నేషన్‌” క్యాంపెయిన్ నిర్వహించింది. మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా తెలంగాణకు రెండు దక్కాయి. తద్వారా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వెల్నెస్ యాక్టివిటీస్‌లో దేశంలోనే మొదటి స్థానంలో, నాన్ కమ్యూనికబుల్ డిసీసెస్ స్క్రీనింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. డిసెంబర్ -13న యూనివర్సల్ హెల్త్ కవరేజీ డే-2021 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అవార్డులను బహూకరించింది.

సిఎం నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ.. మంత్రి టి.హరీశ్‌రావు

నీతి అయోగ్ విడుదల చేసిన స్టేట్ హెల్త్ ఇండెక్స్ 2019-20లో వైద్య సేవలు మెరుగుపడ్డ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలువడం పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఓవరాల్‌గా ఉత్తమ వైద్య సేవలు అందించిన రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ వైద్యరంగంలో దేశంలో అగ్రస్థానం దిశగా పయనిస్తోందని అన్నారు. పల్లెల్లో ఆరోగ్య కేంద్రాల బలోపేతం నుండి పట్టణాల్లో బస్తీ దవఖానలు,సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు వరకు రాష్ట్రంలో వైద్య సదుపాయాలు ఎన్నడూ లేనంతగా మెరుగుపడ్డాయని తెలిపారు. మన రాష్ట్రంలో సామాన్యుడికి ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందుతోందని, ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ మరోసారి స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ ఘనత డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, మొత్తం రాష్ట్ర పాలనా యంత్రాంగం సాధించిన విజయమని అన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలతో కూడిన గ్లోబల్ హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News