Monday, April 29, 2024

శ్రీనగర్‌లో ఎన్ కౌంటర్: ఉగ్రవాది హతం

- Advertisement -
- Advertisement -

Terrorist killed in Encounter in Srinagar

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది హతమయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని హర్వాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఓ ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Terrorist killed in Encounter in Srinagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News