Sunday, April 28, 2024

నిరుపేద నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -
- Advertisement -
  • అభివృద్ధికి కేరాఫ్‌గా తూర్పు నియోజకవర్గాన్ని తీర్చుద్దుతా
  • ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

ఖిలా వరంగల్: నిరుపేదల నిర్మూలనే బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏకైక లక్షమని, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రూ. 4 వేల కోట్ల నిధులతో అద్భుత ప్రగతి సాధిస్తున్నామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రూ. 4 వేల కోట్ల నిధులతో అద్భుత ప్రగతి సాధిస్తామన్నారు. 32వ విజన్ కార్పోరేటర్ పల్లం పద్మ రవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నరేందర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, కేటీఆర్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉందని అందుకే మనకు అత్యధిక నిధులు కేటాయించారన్నారు.

కాంగ్రెస్ పాలకులు అభివృద్ధి చేయడం చేతకాలేదని కాని ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెపుతూ ప్రజలను మభ్యపెట్టడానికి వస్తున్నారని వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. నానమియా తోటలో సోమవారం శంకుస్థాపన చేసిన కమ్యూనిటీ హాలుకు కేటాయించిన రూ. 10 లక్షలతో పాటు అదనంగా మరిన్ని నిధులు కేటాయించి రెండస్తులు, లిఫ్ట్ సౌకర్యం ఉండే విధంగా చూస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(ఎన్‌ఏసీ)ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు అందచేశారు.

ఈ కార్యక్రమలంలో మాజీ కార్పోరేటర్ కల్పన సంజయ్ బాబు, కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్, డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, మండ శ్యామ్, వంగరి కోటి, వెల్ది శివమూర్తి, ఎరుకల మహేందర్, కరాల రాజమణి, బొమ్మల అంబేడ్కర్, కొండ రాజు, గౌడ సందీప్, శోభన్, బిక్షపతి, దస్తగిరి, సతీష్, గౌరమ్మ, బిక్షపతి, ఎల్లన్న, శ్రీను, కళావతి, నాగమణి, సతీష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
* 40వ డివిజన్‌లో రూ. 3.15 కోట్ల సీఎం ప్రత్యేక నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులకు కార్పోరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో దసరా రోడ్డు వద్ద ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఉర్సు సీఆర్సీ భవన్ వద్ద రూ. 32 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో అద్భుత ప్రగతి సాధిస్తున్నామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ నాయకులమని చెప్పుకొని కొందరు ఎవ్వరు స్థానికులు కాదని వారికి ఇక్కడ స్థితిగతులు ఏంటి అనేది వారికి అవగాహన లేదని వాళ్లకు మన బాధలు తెలవదన్నారు.

నియోజకవర్గాన్ని రూ. 4 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, రూ. 1250 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామని, పేదల మధ్య కలెక్టరేట్, బస్ స్టేషన్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వాడ వాడన సీసీ రోడ్లు, ప్రతి డివిజన్‌లో అంతర్గత సీసీ రోడ్లు ఏర్పాటుచేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. 40వ డివిజన్‌లో రూ. 3.15 కోట్లతో గొప్పగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఇప్పటికే ఈ డివిజన్ మొత్తంగా సుమారు రూ. 18 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

రూ. 15 కోట్లతో ఉర్సు బండ్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మరుపల్ల రవి, డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్, బీఆర్‌ఎస్ నాయకులు వగిలిశెట్టి అనిల్‌కుమార్, కోరె కృష్ణ, లక్కాకుల శ్యామ్, ఏలగొండ రవి, మరుపల్ల గౌతమ్, మహేందర్, రజనీకాంత్, శెట్టి మోహన్, వంగరి సురేష్, రాముల సదానందం, ఆవునూరి రామ్మూర్తి, చీర రమేశ్, వగిలిశెట్టి సంజీవ్, ఎండీ సలీమ్, సాంబయ్య, రంజీత్, రాజ్‌కుమార్, సంపత్, నరసింహ, చక్రపాణి, నాగరాజు, రాంకుమార్, ఇమ్రాన్, వహీద, శ్వేత, రజిత, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవసాని శేఖర్, నర్సయ్య, సమ్మయ్య, శ్రీశైలం, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.

* 34వ డివిజన్‌కు చెందిన వల్లపు భాగ్యరాజ్ పేరుక వాడలో నూతనంగా ఏర్పాటుచేసిన టెంట్ హౌస్‌ను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు ముష్కమల్ల అరుణ సుధాకర్, దిడ్డి కుమారస్వామి, సురేష్ జోషి, డివిజన్ అధ్యక్షుడు మిరిపెల్లి వినయ్, పగడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News