Saturday, April 27, 2024

బ్యాంకుల విలీనం కొనసాగుతుంది

- Advertisement -
- Advertisement -

nirmala sitaraman

 

న్యూఢిల్లీ: పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతుందని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ ప్రక్రియ ఉంటుందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియపై ఎటువంటి అనిశ్చితి లేదని అన్నారు. ఈ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. దేశీయ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ల ప్రభావాల గురించి ప్రభుత్వానికి తెలుసని, దీనిని నిశితంగా పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు.

10 ప్రభుత్వ రంగ బ్యాంకులను కలిపి నాలుగు పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలస్యమవుతుందనే సందేహాలు నెలకొన్నాయి. అయితే బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి దీనికి సంబంధించి సమాచారం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం నిఘా పెడుతోందని సీతారామన్ బుధవారం అన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో కరోనావైరస్ కారణంగా 2700 మందికి పైగా మరణించారు. కనీసం 80 వేల మందికి ఈ వైరస్ వ్యాపించింది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా, భారత విమానయాన సంస్థలతో సహా అనేక విమాన సంస్థలు చైనాకు తమ సేవలను రద్దు చేశాయి.

బ్యాంకుల విలీనం గురించి ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, బ్యాంకు విలీనం గురించి ఎటువంటి అనిశ్చితి లేదని, గడువు ప్రకారం ప్రక్రియలు కొనసాగుతున్నాయని చెప్పారు. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం కానున్నాయి. ఈ విలీనం తరువాత పిఎన్‌బి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి భారతదేశపు రెండవ అతిపెద్ద బ్యాంక్‌గా అవతరిస్తుంది. ఇది కాకుండా సిండికేట్ బ్యాంక్‌ను కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌ను ఇండియన్ బ్యాంక్‌తో విలీనం చేయనున్నారు. అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కానున్నాయి.

2 వేల నోటుపై సూచనలు ఇవ్వలేదు
ఎటిఎం మెషిన్లలో బ్యాంకులు 2 వేల నోట్లను పెట్టలేదని వచ్చిన నివేదికలను కూడా ఆర్థిక మంత్రి సీతారామన్ ఖండించారు. ఏటిఎం యంత్రాలలో 2 వేల నోట్లను ఉంచవద్దని బ్యాంకులకు ఎలాంటి సూచనలు జారీ చేయలేదని చెప్పారు.

The Merger of Banks will continue
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News