Monday, April 29, 2024

ఆన్ లైన్ లో తిరుమల సర్వదర్శనం టోకెన్లు

- Advertisement -
- Advertisement -

Thirumala Slotted tokens in online

తిరుపతి: తిరుమలలో శనివారం ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లను టిటిడి విడుదల చేసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు శనివారం ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేసింది.  తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను ఆదివారం ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయడం జరుగుతుందని టిటిడి తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News