Saturday, April 27, 2024

టిష్యూ కల్చర్ ప్రయోగశాల ప్రభుత్వ రంగంలో ఇదే తొలిసారి: నిరంజన్ రెడ్డి

- Advertisement -
 Tissue Culture Laboratory is first of its kind in public sector
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టిష్యూ కల్చర్ ప్రయోగశాల ప్రభుత్వ రంగంలో ఇదే తొలిసారి. టిష్యూ కల్చర్ ప్రయోగశాల ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ, ఉద్యానవన, సహకార & మార్కెటింగ్ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్లలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.4 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న టిష్యూ కల్చర్ ప్రయోగశాల నిర్మాణ పనులకు మంత్రులు నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
మొక్కల పెంపకానికి మరియు మొక్కల పునరుత్పత్తికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పండ్లు, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, చెక్క మొక్కలు, అలంకారాలు, జీవ ఇందనం వంటి మొక్కలను ఈ ప్రయోగశాల ద్వారా తయారు చేసి తెలంగాణ రాష్ట్ర రైతులకు, హరితహారం కార్యక్రమంలో అందుబాటులో ఉంచేందుకు వీలుగా దోహదపడుతుందన్నారు. అదేవిధంగా ఈ ప్రయోగశాల ద్వారా ఒక చిన్న కణజాలం లేదా మొక్కల కణాల నుండి మొత్తం మొక్కను పునరుత్పత్తి చేయవచ్చాన్నారు. ఈ మొక్కలు తల్లి మొక్క నుంచి నిజమైన లక్షణాలను కలిగి ఉంటాయని, సాంప్రదాయ మొక్కల కంటే టిష్యూ కల్చర్ ద్వారా పెరిగిన మొక్కలు శక్తివంతమైనవని, వేగంగా పెరుగుతాయని, ఎక్కువ రెట్లు ఒకే విధమైన మంచి లక్షణాలు కలిగి ఉంటాయన్నారు. వ్యాధులు, వ్యాధికారకాలు ఉండవని, మంచి దిగుబడినిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారు, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ కొండబాల కోటేశ్వర రావు గారు, భారత ప్రభుత్వ రైతు సంక్షేమం, వ్యవసాయ శాఖ ( సీడ్స్ ) సంయుక్త కార్యదర్శి డా.విజయలక్ష్మీ నాదెండ్ల ( ఐఎఎస్ ) గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ హనుమంత్ కే.జెండగే ( ఐఎఎస్ ) గారు, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.కే. కేశవులు, సంస్థ మేనేజర్ జే.శ్రీనివాస్, జీడిమెట్ల ఇంజినీరింగ్ మేనేజర్ ఆర్.నర్సింహా రెడ్డి, జీడిమెట్ల ఆర్ఎం కే.కోటి లింగం, ఇతర అధికారులు రవీందర్ రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News