Monday, April 29, 2024

నేడే ఎంగిలి పూల బతుకమ్మ

- Advertisement -
- Advertisement -

Today Engili Pula Bathukamma celebrations

తొమ్మిది రోజుల పాటు పూలవనాలుగా మారనున్న ఊరూవాడ

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చాటే పండుగ బతుకమ్మ పండుగ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రకృతి ఆరాధనకు, ప్రాణికోటి మనుగడకు నెలవైన మట్టి మనుషుల పండుగ ఇది. ప్రకృతిని ఆరాధిం చే అచ్చమైన పల్లెపండుగ ఇది. మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు ఊరు, వాడలు పూల వనాలుగా పులకరించనున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ నాడు గౌరమ్మను సాగనంపుతారు. తీరొక్క పూలతో సింగిడిలోని రంగుల కలబోతగా ఆడబిడ్డలు బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చుతారు. అందుకే ప్రకృతి ఒడిలో నుంచి వికసించిన తీరొక్క పూలతో తయారుచేస్తారు. పూలు, పసుపు, కుంకుమలతో ఆ గౌరమ్మను భక్తిశ్రద్ధలతో కొలుస్తా రు. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్యతో ఈ పూల పండుగ ప్రారంభమవుతుంది.

దీనినే పెత్రమాస, ఎంగిలిపూల బతుకమ్మ మహాలయ అమావాస్య అంటారు. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరిట ఆ గౌరమ్మను సాగనంపుతారు. పిల్లాపెద్దా తేడా లేకుండా అందరూ బతుకమ్మను ఆడుతారు. బతుకమ్మ పండుగ పేరు వింటే చాలు ఆడబిడ్డల మన సు ఎగిరి పుట్టినింట వాలుతుంది. అందుకే బతుకమ్మ పండుగ కోసం ఆడబిడ్డ తన పుట్టింటికి పోవాలని ఆరాటపడతారు. ఈ పండుగను కోవిడ్ నిబంధనలను పాటి స్తూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ప్రభుత్వం సూచిం చింది. ఈ పండుగ సందర్భంగా మహిళలకు మంత్రులు, ఎమ్మె ల్యేలు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. బతుక మ్మ సందర్భంగా ఈ ఏడాది కూడా 333 కోట్ల రూపాయలతో 800లకు పైగా డిజైన్లలో దాదాపు కోటి 8 లక్షల మందికి చీరలను ప్రభుత్వం అందించిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి కెసిఆర్ శుభాకాంక్షలు

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారం భం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు జరు పుకుంటారని సిఎం తెలిపారు. ఒకనాడు సమైక్యపాలనలో విస్మరించబడిన బతుకమ్మను స్వయం పాలనలో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. తెలంగాణ ప్రజల జీవనం లో భాగమైపోయిన ప్రకృతి పండుగ బతుకమ్మ, నేడు ఖండాంతరాలకు విస్తరించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ విశ్వవ్యాప్త గుర్తింపును తెచ్చిందన్నారు. బతుకమ్మను పల్లె పల్లెనా జరుపుకొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సిఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు కుంటలు నీటితో నిండి వున్నాయని, బతుకమ్మ నిమజ్జనం సంద ర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని అమ్మవారిని సిఎం కెసిఆర్ ప్రార్థించారు.

తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’ను ఆవిష్కరించిన ఎంఎల్‌సి కవిత, దర్శకుడు గౌతమ్ మీనన్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటకు సంగీతం అందించారు. ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. తెలంగాణ ఆడపడచుల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వయవనికపై మెరవనుంది. ప్రపంచం మొచ్చిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో బతుకమ్మ పాట ‘అల్లపూల వెన్నెల’గా సరికొత్త సొబగులు అద్దుకుంది. బతుకమ్మ ఆట, పాటను తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా లోకానికి పరిచయం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంఎల్‌సి కవిత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పాటను నిర్మించారు.

ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ పూల సింగిడిని మంగళవారం దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్‌తో కలిసి ఎంఎల్‌సి కవిత తన నివాసంలో విడుదల చేశారు. ఉత్తరా ఉన్నికృష్ణన్‌పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించగా, జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు. అక్టోబర్ 6 నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా ఘనంగా జరగనుంది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే ఈ పండుగకు ‘అల్లిపూల వెన్నెల’ మరింత శోభను తీసుకొస్తుంది. ఈ పాటను తెలంగాణలోని వివిధ లోకేషన్లలో ఎంతో అందంగా చిత్రీకరించారు. పాటను విడుదల చేసిన సందర్భంగా సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు.

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

తెలంగాణ జాగృతి ‘అలిపూల వెన్నెల’తో ఐక్యతా వేడుకగా బతుకమ్మ అందం మరింత ఇనుమడిస్తుందని ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు. సమైక్యత బతుకమ్మ పండుగ ఇక్కడ ఉందని ఎంఎల్‌సి కవిత అన్నారు. తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం నుండి తెలంగాణ సాంస్కృతీ, సాంప్రదాయాలకు కాపాడటంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News