Saturday, April 27, 2024

పతకానికి గెలుపు దూరంలో సతీష్

- Advertisement -
- Advertisement -

Tokyo Olympics: Indian boxer reached quarter finals

టోక్యో: భారత బాక్సర్ సతీష్ కుమార్ టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. తర్వాతి మ్యాచ్‌లో గెలిస్తే సతీష్‌కు పతకం ఖాయమవుతుంది. గురువారం జరిగిన పురుషుల 91 ప్లస్ విభాగంలో సతీష్ కుమార్ 41 తేడాతో జమైకాకు చెదిన రికార్డో బ్రౌన్‌ను చిత్తు చేశాడు. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే సతీష్ క్వార్టర్ ఫైనల్‌కు చేరి పెను ప్రకంపనలు సృష్టించాడు. భారీ ఆశలతో ఒలింపిక్ బరిలోకి దిగిన సతీష్ అంచనాలకు తగినట్టు రాణిస్తూ పతకం రేసులో నిలిచాడు. ఇక బ్రౌన్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సతీష్ అద్భుతంగా రాణించాడు. కళ్లు చెదిరే పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకు పడ్డాడు. అతని ధాటికి బ్రౌన్ ఎదురు నిలువలలేక పోయాడు.

ఈ మ్యాచ్‌లో సతీష్ 3027, 3027, 2829, 3027, 3026 తేడాతో విజయం సాధించాడు. తొలి రెండు రౌండ్‌లలో సతీష్ పైచేయి సాధించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లక్షం దిశగా అడుగులు వేశాడు. అయితే మూడో రౌండ్‌లో మాత్రం ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈసారి బ్రౌన్ ఆధిపత్యం చెలాయించాడు. కానీ తర్వాతి రెండు రౌండ్‌లలో మళ్లీ సతీష్ దూకుడును ప్రదర్శించాడు. తన మార్క్ పంచ్‌లతో ప్రత్యర్థికి హడలెత్తించాడు. ఈ క్రమంలో వరుసగా రెండు రౌండ్‌లను గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. తర్వాతి పోరులో సతీష్ ఉజ్బెకిస్థాన్‌కు చెందిన బాఖోదిర్ జలోలొవ్‌తో తలపడుతాడు. కాగా జలోలొవ్ ప్రపంచ, ఆసియా చాంపియన్‌గా ఉన్నాడు. అతన్ని ఓడిస్తే మాత్రం సతీష్‌కు కాంస్య ఖాయమవుతుంది.

Tokyo Olympics: Indian boxer reached quarter finals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News