Monday, April 29, 2024

కెనడా ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధనలో ప్రధాని ట్రూడో విఫలం

- Advertisement -
Trudeau fails to win majority
పార్టీగా అధికార లిబరల్
- Advertisement -

టొరొంటో: కొవిడ్19 మహమ్మారిని సమర్థంగా కట్టడి చేయగలిగానన్న ప్రచారంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మెజార్టీ సాధించడంలో విఫలమయ్యారు. అయితే, ఆయన నేతృత్వంలోని లిబరల్ పార్టీ అధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించేదిశగా ఫలితాల సరళి ఉన్నది. మొత్తం 338 స్థానాలున్న కెనడా పార్లమెంట్(హౌస్ ఆఫ్ కామన్స్)లో లిబరల్ పార్టీ 157 సీట్లలో ఆధిక్యతలో ఉన్నది. సాధారణ మెజార్టీ 170కన్నా 14 తక్కువ. 2019 ఎన్నికల్లోనూ ఈ పార్టీకి 157 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో, పూర్తి మెజార్టీ లక్షంగానే ట్రూడో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ, తిరిగి అవే ఫలితాలు రావడం గమనార్హం. ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ 122 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. గత ఎన్నికల్లో ఈ పార్టీకి 121 సీట్లు రావడం గమనార్హం. వామపక్ష న్యూడెమోక్రాట్లు 25 సీట్లలో ఆధిక్యతలో ఉన్నారు. బ్లాక్ క్యూబెకాయిస్‌కు 34 సీట్లు రానున్నాయి. గ్రీన్స్‌కు రెండు సీట్లు రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News