Tuesday, September 17, 2024

యుపిలో గ్యాస్ లీక్: ఇద్దరు మృతి…. 15 మందికి అస్వస్థత

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని ఇప్కో కంపెనీలో అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు మృతి చెందగా 15 మంది సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో మరణించిన వారిలో అసిస్టెంట్ మేనేజర్ విపి సింగ్, డిప్యూటీ మేనేజర్ అభయానంద్ కుమార్ లు ఉన్నారు. పుల్‌పూర్‌లోపి ఫెర్టిలైజర్ ప్లాంట్‌లో అమ్మోనియా, యూరియా యూనిట్లలో సిబ్బంది పనులు చేస్తుండగా లీకేజీ జరిగింది. మంగళవారం రాత్రి 11.30 ప్రాంతంలో జరిగినట్టు సమాచారం. అస్వస్థతకు గురైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. లీకేజీ ప్రమాదంలో మృతి చెందినవారి పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News