Monday, April 29, 2024

సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలు

- Advertisement -
- Advertisement -

Union Cabinet briefs the media over cabinet decisions

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సివిల్ సర్వీసెస్ ఉద్యోగ నియామక సంస్కరణల కోసం తీసుకువచ్చిన ”మిషన్ కర్మయోగి” కార్యాచరణకు కేబినెట్ అమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ అధికారిక భాషల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో 5 భాషలు ఉర్దూ, కాశ్మీరీ, డోగ్రి, హిందీ, ఇంగ్లీష్ అధికారిక భాషలు గుర్తింపు పొందనున్నాయి. ప్రజల డిమాండ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కేబినెట్ సమావేశంలో మరో 3 కీలక  ఎంవోయూలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియా సమావేశంలో ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News