Monday, April 29, 2024

ఎండసెగలలో ప్రయాగ్‌రాజ్

- Advertisement -
- Advertisement -

UP Prayagraj Hits Record 47 Degrees

రికార్డు స్థాయిలో 47 డిగ్రీల వేడి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఎండలు మండిపోతున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఇక్కడ 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర భారతంలో యుపి ఇతర ప్రాంతాలలో వడగాలులు ప్రజలను ఊపిరితీసుకోనివ్వని స్థితిని కల్పించాయి. ప్రయాగ్‌రాజ్‌లో ఎప్రిల్ నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు కావడం గడిచిన 20 ఏండ్లలో ఇదే తొలిసారి. ఇక్కడ ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రత 1999 ఎప్రిల్‌లో 46.3 డిగ్రీలుగా నమోదైంది. నిరుడు ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలు. అంతకు ముందటి ఏడాది వేడి 43.7గా ఉంది. ఈ విధంగా వరుసగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఇప్పుడు ఇది రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు చేరింది. అయితే వచ్చే వారం రోజులలో ఉష్ణోగ్రతలు చల్లారి చివరికి మే 5 నాటికి ఇక్కడ 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతాయని అంచనాలు వెలువడ్డయి. సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే దీనిని అత్యధిక వేడిగా పరిగణిస్తారు. ఇక 47 డిగ్రీలు దాటితే అది తీవ్రస్థాయి ఉష్ణోగ్రతగా నమోదు అవుతుంది. యుపిలోనే కాకుండా హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని భారత వాతావరణ పరిశోధనా విభాగం (ఐఎండి ) సీనియర్ సైంటిస్టు ఆర్‌కె జెనామణి పిటిఐ వార్తాసంస్థకు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీనితో ఢిల్లీ వాసులు అటు కరెంటు కోతలు ఇటు వేడిపోట్లతో సతమతమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News