Sunday, April 28, 2024

రష్యా దాడి చేయడం ఖాయం

- Advertisement -
- Advertisement -
US President Joe Biden sure invade Ukraine
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటన
అనవసర యుద్ధాన్నిఎంచుకున్నందుకు
బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై మరికొన్ని రోజుల్లో దాడి చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం పునరుద్ఘాటించారు. మహా విపత్కరమైన, అవసరం లేని యుద్ధాన్ని ఎంచుకున్నందుకు బాధ్యత వహించాలని రష్యాను బైడెన్ హెచ్చరించారు. రష్యా ప్రణాళికలను గట్టిగా మళ్లీ మళ్లీ ఖండిస్తున్నామని వాషింగ్టన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ బైడెన్ చెప్పారు. దీనికి కారణం ఘర్షణ జరగాలని కోరుకోవడం కాదని, ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించుకునేందుకు రష్యాకు ఏదైనా కారణం ఉండకుండా చూసేందుకేనని చెప్పారు. యుద్ధం దిశగా రష్యా ముందుకు కదలడాన్ని నిరోధించేందుకు తాము తమ శక్తినంతా వినియోగించి అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. అయితే ఉక్రెయిన్‌కు బలగాలను పంపబోమని స్పష్టం చేసిన బైడెన్ అయితే ఉక్రెయిన్ ప్రజలకు మద్దతును అమెరికా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

రానున్న కొద్ది రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడికి రష్యా దళాలు ప్రణాళిక రచిస్తున్నాయని,ఆలోచిస్తున్నాయని విశ్వసించడానికి తగినకారణం ఉందని చెప్పారు. ఉక్రెయిన్ రాజధానినగరం కీవ్‌పై రష్యా దళాలు దాడి చేస్తుందని నమ్ముతున్నామన్నారు. ఈ నగరంలో 28 లక్షల మంది ప్రజలు ఉన్నారన్నారు. బెలారస్‌నుంచి దక్షిణ దిశలో ఉన్న నల్లసముద్రం వరకు రష్యా తన దళాలను మోహరించిందన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ను బైడెన్ ప్రశంసించారు. నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకోవడానికి అమెరికా,దాని మిత్ర దేశాలు సిద్ధంగా ఉన్నాయని, అదే విధంగా ఉమ్మడి భద్రతకు ఎదురయ్యే ముప్పును కూడా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌లు ఈ నెల 24న సమావేశమయ్యేందుకు రష్యా అంగీకరించిందన్నారు. అంతకన్నా ముందే సైనిక చర్యకు రష్యా ఉపక్రమిస్తే దౌత్యమార్గానికి తలుపులు మూసినట్లేనని బైడెన్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News