Monday, April 29, 2024

మహారాష్ట్ర గవర్నర్‌కు ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: మాజీ ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన ప్రభుత్వ బంగళాకు మార్కెట్ రేటుపై అద్దె కట్టాలన్న కోర్టు ఉత్తర్వులను పాటించనందుకు కోర్టు ధిక్కరణ ప్రక్రియను చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌పై మీ వైఖరి తెలియచేయవలసిందిగా కోరుతూ ఉత్తరాఖండ్ హైకోర్టు మంగళవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి నోటీసులు జారీచేసింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం కేటాయించిన బంగళాకు మార్కెట్ రేటుపై అద్దె చెల్లించాలంటూ 2019 మే 3వ తేదీన ఉత్తరాఖండ్ హైకోర్టు కోష్యారీని ఆదేశించింది. తమ ఆదేశాలను ఆరు నెలల్లోగా పాటించాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా కోష్యారీ పాటించలేదని, ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ డెహ్రాడూన్‌కు చెందిన రూరల్ లిటిగేషన్ అండ్ ఎంటైటిల్‌మెంట్ కేంద్ర అనే ఎన్‌జిఓ పిటిషన్ దాఖలు చేసింది.

అద్దె చెల్లించకపోవడమే కాక తాను అనుభవించిన కరెంటు, నీరు, పెట్రోల్, చమురు తదితర ఇతర సౌకర్యాలకు సంబంధించిన వాటి బకాయిలు కూడా ఆయన చెల్లించలేదని పిటిషనర్ ఆరోపించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడానికి 60 రోజుల ముందుగానే కోష్యారీకి నోటీసు అందచేసి రాజ్యాంగంలోని 361(4) అధికరణ కింద నిబంధనలు పాటించామని పిటిషనర్ తరఫు న్యాయవాది కార్తికేయ హరి గుప్తా కోర్టుకు తెలిపారు. అద్దె బకాయిలు చెల్లించకుండా ఆయనను విముక్తుడ్ని చేయడానికి ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి సౌకర్యాలు(నివాస, ఇతర సౌకర్యాలు) పేరిట 2019లో ఒక ఆర్డినెన్సును జారీచేయడంతో పాటు ఒక చట్టాన్ని కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకువచ్చిందని పిటిషనర్ ఆరోపించారు.

UttaraKhand HC Issues Notice to Maharashtra Governor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News