Thursday, May 9, 2024

వృద్ధుల ఇళ్లకు వెళ్లి టీకా వేస్తారా ? కేంద్రం వద్దన్నా మేం అనుమతిస్తాం : బోంబే హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ముంబై : కరోనా టీకా కేంద్రాలకు స్వయంగా వచ్చే శక్తి లేని వయోవృద్ధుల ఇళ్లకు వెళ్లి టీకా వేయడానికి ప్రయత్నించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను బోంబే హోకోర్టు కోరింది. ఈ విధంగా ఇళ్లకు వెళ్లి టీకాలు ఇవ్వడానికి బిఎంసి అంగీకరిస్తే కేంద్రప్రభుత్వం అంగీకరించకపోయినా తాము అనుమతిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కులకర్ణి డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. న్యాయవాదులు ధ్రుతి కపాడియా , కుణాల్ తివారీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టినప్పుడు ఈ ప్రశ్నను సంధించింది. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఇంటింటికి వెళ్లి టీకా వేయడం సాధ్యం కాదని తెలియజేసింది. మంచానికి పరిమితమైన వారు, వీల్‌చైర్‌లోనే గడిపేవారు, వయోవృద్ధులు, దివ్యాంగులు తదిరుల ఇళ్ల వద్ద తగిన వైద్య పరమైన రక్షణ చర్యలతో టీకాలు ఇవ్వడం సాధ్యాసాధ్యాలపై అఫిడవిట్‌ను గురువారం దాఖలు చేయాలని బిఎంసి కమిషనర్ ఇక్బాల్ చాహల్‌ను కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News