Monday, April 29, 2024

4 చైనా నగరాల్లో టీకామందు పంపిణీ

- Advertisement -
- Advertisement -

Vaccine distribution in four Chinese cities

 

బీజింగ్ : చైనాలో కరోనా వైరస్‌ల అత్యయిక వాడకాన్ని మరో మూడు నగరాలకు విస్తరించారు. చైనాలో ఇప్పటికే రెండు మూడు వ్యాక్సిన్‌లు అత్యంత కీలకమైన పరీక్షల దశలో ఉన్నాయి. వైరస్‌కు మూలమైన చైనా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని కోవాక్స్ కూటమిలో చేరింది. వ్యాక్సిన్ పంపిణీ, రూపకల్పనల దిశలో ప్రపంచదేశాల మధ్య సహకారంలో పాలుపంచుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దేశంలో అత్యవసరంగా కోవిడ్ వ్యాక్సిన్ అవసరమైన వారికి దీనిని పంపిణి చేసేందుకు చైనా అధికార యంత్రాంగం సిద్ధం అయింది. ఈ దిశలో ఇవూ, నింగ్బో, షావోజింగ్ నగరాలలో వైరస్ అందించేందుకు రంగం సిద్ధం అయింది.

ఇంతకు ముందు జియాజింగ్ సిటీలో అత్యవసర సర్వీసులలో ఉండే వారికి, ఇతరత్రా త్వరితగతిన వ్యాక్సిన్ అవసరం ఉన్న వారికి దీనిని చేరవేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పుడు మరో మూడు నగరాలల్లోనూ వివిధ రకాల వ్యాక్సిన్లను పంపిణీ చేస్తారని అధికారులు తెలిపినట్లు అధికారిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. అంతర్జాతీయంగా ఉత్పత్తి కేంద్రంగా పేరొందిన ఇవూలోనూ అత్యవసర వ్యాక్సినేషన్‌ను ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. నిర్ణీతంగా ఎంచుకున్న వారికి ఈ టీకామందు వాడి ఫలితాలను పరీక్షిస్తున్నారు. ఈ దిశలో ఇప్పటికే ఇవూలో 20 మంది వరకూ ముందుకు వచ్చినట్లు అధికారిక వివరణల పేరిట పత్రిక తెలియచేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News