Friday, May 17, 2024

టీజర్ వచ్చేది అప్పుడే..

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్‌గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కమ్‌బ్యాక్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే టీజర్‌ను విడుదల చేసి భారీ రికార్డులు నెలకొల్పాలని ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ముందుగా కొత్త సంవత్సరం కానుకగా అనుకున్న ఈ టీజర్‌ను సంక్రాంతికి వాయిదా వేసినట్టు తెలిసింది. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News