Sunday, April 28, 2024

‘మైఖేల్’లో ముఖ్య పాత్రలో…

- Advertisement -
- Advertisement -

Varalaxmi act in Mykhel film

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మైఖేల్’ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని రంజిత్ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన దివ్యాంక కౌశిక్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని ప్రకటించారు. స్టార్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. రంజిత్ జయకోడి ఈ చిత్రానికి విభిన్నమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. నారాయణ్ దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పి.రామ్‌మోహన్ రావు కలిసి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News