Monday, April 29, 2024

శీతాకాలంలో కరోనా రిస్క్

- Advertisement -
- Advertisement -

Ventilation systems may increase Coronavirus

లండన్ : చాలా నివాస భవనాల్లో చాలీచాలని వెంటిలేషన్‌తో ముఖ్యంగా శీతాకాలంలో కరోనా రిస్కు తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్‌లో కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేపట్టారు. జర్నల్ ఆఫ్ ఫ్లూయెడ్ మెకానిక్స్‌లో ఈ అధ్యయనం వెలువడింది. జనం దగ్గినా, తుమ్మినా,మాట్లాడినా. ఊపిరి పీల్చినా విడిచినా తుంపర్ల ద్వారా మొదట కరోనా వైరస్ వ్యాపిస్తుందని, అందువల్ల వెంటిలేషన్ సరిగ్గా ఉండి, మాస్క్‌లు ధరించడం తదితర జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను చాలావరకు నియంత్రించ డానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు అధ్యయనంలో వివరించారు. ఉత్తరార్ధ గోళంలో శీతాకాలం సమీపిస్తోందని, జనం ఎక్కువగా ఇళ్లలోనే గడుపుతుంటారని, ఈ పరిస్థితుల్లో వెంటిలేషన్ పాత్రను అర్ధం చేసుకోగలిగితే కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేయడమే కాక, తగ్గించడానికి సహాయపడుతుందని కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రొఫెసర్ పాల్ లిండన్ చెప్పారు.

శ్వాస లోని తుంపర్లు కరోనా వైరస్‌ను కలిగి ఉంటాయని, శ్వాస సమయంలో వెలువడే కార్బన్ డైయాక్సైడ్‌తో కలసి రవాణా అవుతుంటాయని వెంటిలేషన్ ప్రసారం వల్ల గదిలో వ్యాపిస్తుంటాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో చాలీచాలని వెంటిలేషన్ వల్ల వైరస్ రిస్కు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. గదిలో గాలి ప్రసారం రెండు విధాలుగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియచేశారు. మొదటి విధం సర్వసాధారణం. గాలి కోసం అమర్చిన వెంటిలేటర్లు వల్ల గాలిలో ఉష్ణోగ్రత, వ్యాప్తి చెందే సాంద్రత గది అంతా వ్యాపించి ఉంటాయని వివరించారు. రెండో పద్ధతిలో గాలిని బయటకు పంపడానికి గదిలో కిందన, మీదన వెంటిలేటర్లు అమర్చుతారని, దీనివల్ల దిగువ జోన్ చల్లగా, ఎగువ జోన్ వేడిగా ఉంటుందని, వేడి గాలి గది మీదనున్న వెంటిలేటర్ల ద్వారా బయటకు పోతుందని పేర్కొన్నారు.

శ్వాస తీసుకుని విడిచిపెట్టేటప్పుడు కూడా వేడిగా ఉంటుందని, మీది జోన్ లోనే చాలావరకు తుంపర్లు పేరుకుపోతుంటాయని చెప్పారు. శ్వాసను విడిచిపెట్టడంలో వివిధ రకాల పద్థతులను శాస్త్రవేత్తలు వివరించారు. ముక్కుద్వారా శ్వాస, మాట్లాడుతున్నప్పుడు, నవ్వినప్పుడు, ఈ రెండూ ఒకేసారి మాస్క్ లేకుండా చేసినప్పుడు వేడిగాలి శ్వాసతో కలుస్తుందని పేర్కొన్నారు. నిశ్చలంగా కూర్చున్నప్పుడు మనుషులు వేడిని విడిచిపెడుతుంటారని, దాంతో వేడి గాలి ఇంటి సీలింగ్ వరకు పైకి లేస్తుందని శాస్త్రవేత్త భగత్ వివరించారు. కరోనా సోకిన వ్యక్తి ఇంటిలో మాస్క్ లేకుండా గట్టిగా నవ్వితే వైరస్ వ్యాప్తి చిక్కు పెంచుతుందని చెప్పారు. అందువల్ల కిటికీలు బాగా తెరిచి ఉంచి మాస్క్ ధరించడం మేలైన సలహాగా సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News