Monday, April 29, 2024

మళ్ళీ టాప్ లో విరాట్ కోహ్లి..

- Advertisement -
- Advertisement -

Virat Kohli stays on Top of ICC ODI Rankings

దుబాయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసిసి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలతో అలరించిన కోహ్లి తిరిగి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లి 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లి (56; 66) అర్ధ సెంచరీలు కొట్టాడు. దీంతో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను వెనక్కి నెట్టి కోహ్లి టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. బాబర్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన మూడో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. రోహిత్ 825 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఇక న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టెలర్ నాలుగో స్థానాన్ని సాధించాడు. అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) ఐదో, డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా) ఆరో, బెయిర్‌స్టో (ఇంగ్లండ్) ఏడో, డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 8వ ర్యాంక్‌లో నిలిచారు. ఇక షాయ్ హోప్ (విండీస్), డికాక్ (సౌతాఫ్రికా)లు కూడా టాప్10 ర్యాంక్‌లలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో బౌల్ట్ 737 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అఫ్గానిస్థాన్ బౌలర్ ముజీబుర్ రహ్మాన్ రెండో, మ్యాచ్ హెన్రీ న్యూజిలాండ్ మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా ఒక ర్యాంక్‌ను చేజార్చుకుని నాలుగో ర్యాంక్‌ను సాధించాడు. మెహదీ హసన్ (బంగ్లాదేశ్) ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో షకిబ్ అల్ హసన్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బెన్‌స్టోక్స్ (ఇంగ్లండ్) రెండో, మహ్మద్ నబి (అఫ్గాన్) మూడో, క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్) నాలుగో, ఇమాద్ వసీం (పాకిస్థాన్) ఐదో ర్యాంక్‌లో నిలిచారు.

Virat Kohli stays on Top of ICC ODI Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News