Monday, April 29, 2024

సిఎం కెసిఆర్‌తోనే సర్కార్ బడులకు మహర్దశ

- Advertisement -
- Advertisement -
  • ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్: తెలంగాణ రాష్ట్రంలోని సర్కార్ బడులకు సిఎం కెసిఆర్ నేతృత్వంలో మహర్దశ వచ్చిందని ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం విద్యాదినోత్సవంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారంలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జరగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తెచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణల కారణంగా విద్యారంగంలో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులతోపాటు విద్యా ప్రమాణాలు అభివృద్ధి చెందటంతో ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యాసంస్థలకు విద్యార్థుల వలసలు పెరిగాయని 2022/23 విద్యాసంవత్సరంలోనే సుమారు లక్ష మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పొందారని ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

దేశంలో అత్యధిక గురుకుల విద్యాలయాలున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, రాష్ట్రంలో వేయి గురుకుల పాఠశాలల్లో 6లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసిస్తున్నారని ఆయన చెప్పారు. గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై లక్షా 25 వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రూ7,200 కోట్లు ప్రభుత్వం కెటాయించిందన్నారు. రాష్ట్రంలో 26,800 ప్రభుత్వ పాఠశాలలో ఉమారు 23లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. దళిత గిరిజన విద్యార్థులు విదేశాల్లో విద్యనేర్చుకోవటానికి వెళ్లితే వారికి ఒక్కొక్కరికి రూ.20 లక్షలు విదేశీ ఓవర్సీస్ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అదిస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు 132 ఎస్సీ గురుకులాలు ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మరో 104 పాఠశాలలను ప్రారంభించుకున్నామని తెలిపారు.

అలాగే 19 బిసి గురుకులాలు గతంలో ఉంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పుడు 207 బిసి గురుకులాలు ఏర్పాటయ్యాయన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 3 మెడికల్ కాలేజీలుంటే నేడు 26 మెడికల్ కళాశాలలు వచ్చాయని ఆయన గణాంకాలతో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. పాఠశాలలో అదనపు గతులను ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు రాగి సంకటి అందచేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం క్రిష్ణారెడ్డి, ఎంఇఓ సునీత, సర్పంచ్ బాల చంద్రం, ఎంపిపి వైస్ కృష్ణాగౌడ్, ఎంపిటిసి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News