Friday, May 3, 2024

మహిళా కానిస్టేబుల్ పై మామ అత్యాచారం… భర్త ట్రిపుల్ తలాక్

- Advertisement -
- Advertisement -

Photographer Booked for alleged rape of 28 year old Model

లక్నో: మహిళా కానిస్టేబుల్‌పై ఆమె మామ అత్యాచారం చేయడంతో భర్తకు ఈ విషయం చెప్పడంతో అతడు ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నజీర్ అహ్మద్ అనే వ్యక్తి పిఎసిలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడి కుమారుడు అబిడ్ ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం ఓ మహిళా కానిస్టేబుల్‌ను అబిడ్‌ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వరకట్నం కావాలని ఆమెను వేధించేవాడు. భర్త లేని సమయంలో మామ నజీర్ అహ్మద్ ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె తన భర్తకు ఈ విషయం చెప్పడంతో అవసరం లేదని ఆమెకు ట్రిపుల్ తలాక్ అని చెప్పాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త, మామపై సదరు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. ఎస్‌పి వినిత్ భట్నాగర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News