Monday, April 29, 2024

మనసు ఎంత గొప్పదో…. రెండు మేకలను అమ్మి… సిఎం రిలీఫ్ ఫండ్‌కు

- Advertisement -
- Advertisement -

Corona

 

తిరువనంతపురం: కేరళలోని ఓ మహిళ తనకు ఉన్న రెండు మేకలను అమ్మగా వచ్చిన డబ్బులను సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. ఆమె డబ్బుకు పేదరాలు కావొచ్చు కానీ సహాయం చేయడంలో ధనవంతురాలు అని కేరళ వాసులు ప్రశంసించారు. సుబైధా అనే మహిళ చిన్న టీ షాపు నడిపిస్తోంది. ఆ టీ షాపు ద్వారా ఆమె కుటుంబం జీవనం సాగిస్తోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో కేరళ రాష్ట్రం ముందుగానే లాక్‌డౌన్ విధించింది. రెండు నెలల నుంచి ఆమె టీ షాపును మూసివేసింది. తన భర్తకు మూడు వారాల క్రితం గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఆమె తమ్ముడు వాళ్ల దగ్గరనే ఉంటాడు. అతడు కూడా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆమె ముగ్గురు పిల్లలకు వివాహం కావడంతో వేరుగా ఉంటున్నారు. ఎలాగైనా కరోనా బాధితులకు సహాయం చేయాలని సుబైధా నిర్ణయం తీసుకుంది. వెంటనే తన భర్తకు తెలిపింది. వాళ్లకున్న 20 మేకలలో రెండు మేకలను అమ్మగా వచ్చిన డబ్బులను కోల్లామ్ కలెక్టర్‌కు ఇచ్చింది. కరోనా బాధితులు సహాయం చేయాలని కలెక్టర్‌కు సూచించింది. దీంతో ముఖ్యమంత్రి పినరయి విజయ్ పోన్ చేసి ఆమెను అభినందించాడు. కొందరు దాతలు ఆమె దగ్గరకు  వచ్చి ఆమె కుటుంబానికి సహాయం చేస్తామన్నారు. ఎవరు సహాయం అవసరం లేదని కరోనా బాధితులకు, ఆకలితో అలమటించే వారికి సహాయం చేయాలని సూచించింది. వయనాడ్‌లోని ఓ డాక్టర్ ఫోన్ చేసిన ఆమె భర్తకు అవసరమై మెడిసిన్ పంపిస్తానని చెప్పినా కూడా ఆమె సున్నితంగా తిరస్కరించింది. అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే తనకు ఫోన్ చేయమని ఆ వైద్యుడు ఆమెకు ఫోన్ నంబర్ ఇచ్చాడు. కోల్లామ్ కలెక్టర్ అబ్దుల్ నసర్, ఎంఎల్‌ఎ ముఖేష్ ఆమె ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.

 

Woman sold goats to donate to COVID-19 relief fun

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News