Monday, April 29, 2024

విషవాయువు పీల్చి కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

Worker dead

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: రసాయానాలను ఓ డ్రమ్ములోంచి మరో డ్రమ్ములోకి మార్చుతుండగా వాటి నుంచి వెలువడిన విష వాయువులను పీల్చి ఆస్వస్థతకు గురైన ఓ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన వికాస్(25) బోల్లారం ప్రాంతంలో నివాసం ఉంటూ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫేజ్ 3లోని కోపల్లి ఫార్మా పరిశ్రమలో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి విధులకు హాజరైన వికాస్ ఓ డ్రమ్ములోని రసాయానాలను మరో డ్రమ్ముల్లోకి మారుస్తున్న క్రమంలో వాటి నుంచి వెలువడిన విష వాయువులను పీల్చిన వికాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు వికాస్‌ను సూరారంలొని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పోందుతూ మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈ కంపెనీలో అనుమతులు లేకుండ తయారు చేస్తున్న నిషేదిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అనుమతులు లేకుండ భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకోకుండ అనుభవం లేని కార్మికులతో పని చేయిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో జయరాజ్ కంపెనీలో ప్రమాదం జరిగి బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు కార్మికులు మృతి చెందారని, ఈ సంఘటన మరవక ముందే మరో సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు.

Worker dead after Poisson gas inhales in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News