Monday, April 29, 2024

భూమితోనే.. మన మనుగడ

- Advertisement -
- Advertisement -

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘మనం అడవుల కు ఏం చేస్తున్నామో.. అది అద్దంలో ప్రతిబింబం లాగా… తిరిగి మనకే చెందుతుందన్న’ జాతిపిత -మహాత్మాగాంధీ వ్యాఖ్యలు స్మరణీయం.. 1972 లో తొలిసారి ప్రపంచ పర్యావరణ దినాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ రోజు.. మానవ పర్యావరణం అనే అంశంపై స్వీడన్ రాజధాని స్టాట్కామ్లో భారీ ఎత్తున్న సమావేశాన్ని నిర్వహించింది. 1973లో తొలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక్కో దేశం అతిథ్యం ఇస్తుం ది. ఈ దినోత్సవానికి ఈ ఏడాది 50వ పుట్టిన రోజు, ఈ సంవత్సరం నెదర్లాండ్స్ వేడుకలు జరగనున్నాయి.

ఈ సంవత్సరం ‘ప్లాస్టిక్ కాలుష్యాని కి పరిష్కారాలు‘ అనే థీమ్‌ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. నిజమే మనకు జీవించేందుకు ఉ న్నది ఒకటే భూమి. ఇది నాశనం అయితే.. మ నకు దిక్కుండదు. కానీ దీన్ని కాపాడే విషయంలోనే ప్రభుత్వాలన్నీ ఒకే మార్గంలోకి వచ్చి విఫలమవుతున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనగానే అందరి మనసులో ఏదో తెలియని ఆ నందం కలుగుతుంది. ఎందుకంటే మనం నిత్యం ప్రకృతితో కలిసి జీవిస్తుంటాం. ప్రతి ఏడాది జూన్ 5 రాగానే.. ప్రపంచం మొత్తం పర్యావరణం గురించి మాట్లాడుకుంటుంది. భూమికి కలుగుతున్న రకరకాల కాలుష్యాలను ఎలా తగ్గించాలో చర్చిస్తాయి. ఏం చెయ్యాలో అలోచిస్తాయి. తీర్మానాలు, అవగాహనా కార్యక్రమాలు జరుపుతాయి.

పుడమికి మానవాళితోనే హాని..

భూమికి అత్యంత హాని చేస్తున్నది మనుషులే. ప్ర పంచ దేశాల ప్రభుత్వాలన్నీ రకరకాల కాలుష్యాలను సముద్రాల్లోకి పంపిస్తున్నాయి. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ఉండనే ఉంది. ఇవి చాలనట్లు అధిక జనాభా సమస్య మరొకటి, వీటికి తోడు భూతాపం, ప్రపంచాన్ని ప్లాస్టిక్ ముంచెత్తుతోంది. ప్రతి సంవత్సరం 400 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉత్పత్తి చేయబడుతుంది. అందు లో సగం ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడేలా రూపొందించబడింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయంటే కారణం భూతాపమే.

మన తెలంగాణలో తొమ్మిదేళ్లుగా హరితహారంలో కోట్ల మొక్కలు పెంచినా… చల్లదనం రావట్లేదంటే కారణం.. వాయు కాలుష్యం అంతకంటే ఎక్కువగా ఉండటం వల్లే. ఈ భూమిపై ఒకప్పుడు చాలా రకాల ప్రాణులుండేవి. అవన్నీ అంతరించిపోయాయి. ఇప్పడికీ చాలా వాటిని చంపేస్తున్నా రు. పక్షులు చూద్దామన్నా కనిపించట్లేదు. తేనెటీగల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఆహార దిగుబడి తగ్గుతోంది. దిగుబడి పెంచేందుకు పురుగుమందులు, రసాయనాలు వాడుతుంటే.. భూమి నాశనం. అవుతోంది. సముద్ర జీవుల్ని కూడా. బ తకనివ్వట్లేదు. ప్రభుత్వాల మాటలే తప్ప చేతల్లో పర్యావరణ రక్షణ కనిపించట్లేదని ప్రకృతి ప్రేమికులు ఏటా అనేదన చెందుతూనే ఉన్నారు.

ప్రమాణం చేద్దాం..

కాలుష్యాన్ని తగ్గించాలంటే… సోలార్ పవర్ ఉత్ప త్తి పెంచుకోవాలి. ఇళ్లలో లెడ్ లైట్ల వాడకం పెరగాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ విద్యగా అమలవ్వాలి. పె ద్ద ఎత్తున్న మొక్కలను పెంచాలి. చెట్లను నరికేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. భారీ చెట్లను తొలగించాల్సి వస్తే.. వాటిని మరో చోట నాటాలి. వ్య వసాయంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్ని జోరుగా అమలుచెయ్యాలి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచాలి. ఇవన్నీ మనకు తెలిసినవే… వీ టి అమలే సరిగా జరగట్లేదు. అదే సమస్యపుతోం ది. భూమిపై కొద్దిగా ఉండే వజ్రాలకు ఎంతో వి లువ, అలాంటిది. ఈ విశ్వంలోనే మనం జీవించేందుకు వీలైన ఒకే ఒక్కటి భూమి. దానికి విలువ కట్టలేం. అమూల్యమైనది. దాన్ని కాపాడుకుందాం. చేతనైనంతగా ప్రయత్నిద్దాం.

ఈ భూమి మన ఇల్లు. దీన్ని పరిశుభ్రంగా, పచ్చ గా ఉంచుదాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ప్రకృతిని కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం. పంచ భూతాల్ని కాలుష్యమయం చేస్తే.. ఆ మసి అంటుకునేది. మనకే నాశనం అయ్యేది మన జీవితాలే. నిల్చున్న కొమ్మనే నరుక్కుంటు న్నాం. ఇకనైనా ప్రకృతిని కాపాడే దీరగా అడుగు లు వేద్దాం. ‘ఈ భూమి అందంగా, ఆనందంగా ఉండేందుకు.. మనం అవకాశం ఇవ్వకపోతే… ఇది చివరికి ఆహారాన్ని కూడా ఉత్పత్తి చేయదన్న మహానీయుల మాటలు మనకు స్ఫూర్తిగా నిలువాలి. ‘చక్కటి పర్యావరణానికి పక్షులు నిదర్శనం. ఈ రోజు వాటికి సమస్య వస్తే.. ఆ తర్వాత రేపు మనకు ఆ సమస్య వస్తుందని గమనించాలి.

5న పిసిబిలో పర్యావరణ దినోత్సవం..

ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ‘ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు‘ అంశంపై సనత్‌నగర్‌లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కెటిఆర్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News