Sunday, April 28, 2024

కేసులు తక్కువ… డిశ్చార్జ్‌లు ఎక్కువ

- Advertisement -
- Advertisement -

1445 New Covid Cases and 6 deaths in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండగా, డిశ్చార్జ్‌ల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 1445 పాజిటివ్‌లు నమోదు కాగా, 1486 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లారు. అంటే వైరస్ సోకిన వారి కంటే కోలుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నట్లు హెల్త్ డైరెక్టర్ బులెటెన్‌లో వెల్లడించారు. శుక్రవారం టెస్టు చేసిన శాంపిల్స్‌లో జిహెచ్‌ఎంసి పరిధిలో 286 కేసులు నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 19, భద్రాద్రి 90,జగిత్యాల 35, జనగాం 25, భూపాలపల్లి 21, గద్వాల 10, కామారెడ్డి 22, కరీంనగర్ 65,ఖమ్మం 77, ఆసిఫాబాద్ 7, మహబూబ్‌నగర్ 28 , మహబూబాబాద్ 19, మంచిర్యాల 18, మెదక్ 22, మేడ్చల్ మల్కాజ్‌గిరి 122, ములుగు 22, నాగర్‌కర్నూల్ 23, నల్గొండ 102, నారాయణపేట్ 4, నిర్మల్ 22, నిజామాబాద్ 18, పెద్దపల్లి 25, సిరిసిల్లా 26, రంగారెడ్డి 107, సంగారెడ్డి 27, సిద్ధిపేట్ 43, సూర్యాపేట్ 29, వికారాబాద్ 22, వనపర్తి 21, వరంగల్ రూరల్ 17, వరంగల్ అర్బన్ లో 53, యాదాద్రిలో మరో 18 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,38,632 కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,18,887కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

ప్రతి పది లక్షల్లో లక్షా 15 వేల మందికి టెస్టులు…

రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. నాలుగు నెలలతో పోల్చితే ప్రస్తుతం మూడు రెట్లు అదనంగా టెస్టులను నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం చేసిన 41,243 టెస్టులను కలిపి ఇప్పటి వరకు 42,81,991 మంది పరీక్షలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అంటే ప్రతి పది లక్షల్లో లక్షా 15 వేల మందికి పరీక్షలు చేసినట్లు బులెటెన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రకారం తెలంగాణలో ప్రతి రోజు కేవలం 5600 పరీక్షలు మాత్రమే చేయాలి. కానీ రాష్ట్రంలో డబ్లూహెచ్‌ఓ సూచించిన దాని కంటే ఏకంగా 20 రెట్లు అదనంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారి డా జి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

హైప్లో ఆక్సిజన్‌పై సినీనటుడు రాజశేఖర్…

సినీనటుడు రాజశేఖర్ హై ప్లో ఆక్సిజన్‌పై ఉన్నారని సిటీ న్యూరో ఆసుపత్రి శనివారం హెల్త్ బులెటెన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం అతని శరీరం చికిత్సకు సహకరిస్తుందని వైద్యులు వెల్లడించారు. ఈసందర్బంగా ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, సిటీ న్యూరో ఆసుపత్రి బృందం అద్బుతమైన చికిత్సను అందిస్తున్నారని రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హెల్త్ బులెటెన్‌ను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.

1445 New Covid Cases and 6 deaths in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News