హైదరాబాద్: ఒకే అపార్ట్మెంట్లో 28 మందికి కరోనా వైరస్ సోకడం కలకలం సృష్టిస్తున్న సంఘటన హైదరాబాద్‌లోని మాదన్నపేటలో జరిగింది. కరోనా బారిన పడిన వారిలో 11 ఏళ్ల చిన్నారి, 80 ఏళ్ల వృద్ధులు, నిండు గర్భిణీ కూడా ఉంది. గర్భిణి ఇంట్లో నలుగురికి కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కూడా నిండు చూలాలు కావడంతో భయపడుతోంది. వైద్యులు నిండు గర్భిణికి ధైర్యం చెప్పడమే కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాదన్నపేటలోని సదరు అపార్ట్మెంట్లో 15 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలలో ఐటి, కార్పొరేట్ కంపెనీలలో పని చేసేవారు ఎక్కువగా ఉన్నారు. అపార్ట్మెంట్లో ఓ చిన్నారికి ఏప్రిల్ తొలి వారంలో జన్మదిన వేడకులు నిర్వహించారు. ఈ వేడుకలకు అపార్ట్మెంట్లో పలు కుటుంబాలు పాల్గొన్నాయి.
చిన్నారి తండ్రి జ్వరం, దగ్గతో బాధపడుతుండడంతో వైద్యులు పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. చిన్నారికి పరీక్ష చేయగా ఆమె కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో అపార్ట్మెంట్ అందరికి పరీక్షలు చేయగా 28 మంది కరోనా బారిన పడ్డట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1509కి చేరుకోగా 34 మంది మృత్యువాతపడ్డారు. భారత దేశంలో కరోనా వైరస్ 90,813 మందికి సోకగా 2875 మంది చనిపోయారు. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 47.22 లక్షలకు చేరుకోగా 3.13 లక్షల మంది మరణించారు. ఒక్క అమెరికాలో కరోనా వైరస్ 15 లక్షల మందికి సోకగా 90 వేల మంది మృతి చెందారు. ముంబయిలో మాత్రం కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఒక్క ముంబయిలో కరోనా కేసులు 18 వేలకు పైగా నమోదు కాగా దాదాపుగా 700 మంది బలయ్యారు. మహారాష్ట్రలో ఇప్పటి కరోనా వైరస్ 30706 మందికి వ్యాపించగా 1135 మంది మృత్యువాతపడ్డారు.
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:
రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు | బాధితుల సంఖ్య | చికిత్స పొందుతున్నవారు | కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|---|
|
30,706 | 22,483 | 7,088 | 1,135 |
|
10,989 | 6,056 | 4,308 | 625 |
తమిళనాడు | 10,585 | 6,973 | 3,538 | 74 |
ఢిల్లీ | 9,333 | 5,278 | 3,926 | 129 |
రాజస్థాన్ | 5,030 | 1,911 | 2,991 | 128 |
|
4,790 | 2,232 | 2,315 | 243 |
|
4,258 | 1,713 | 2,441 | 104 |
|
2,576 | 1,452 | 892 | 232 |
|
2,355 | 953 | 1,353 | 49 |
పంజాబ్ | 1,946 | 657 | 1,257 | 32 |
|
1,509 | 504 | 971 | 34 |
బిహార్ | 1,178 | 731 | 440 | 7 |
జమ్ము కశ్మీర్ | 1,121 | 567 | 542 | 12 |
కర్నాటక | 1,092 | 559 | 496 | 36 |
హర్యానా | 887 | 360 | 514 | 13 |
ఒడిశా | 828 | 627 | 196 | 5 |
|
588 | 87 | 497 | 4 |
ఝార్ఖండ్ | 217 | 101 | 113 | 3 |
ఛండీగఢ్ | 191 | 137 | 51 | 3 |
త్రిపుర | 167 | 103 | 64 | 0 |
అస్సాం | 96 | 52 | 41 | 2 |
|
91 | 39 | 51 | 1 |
హిమాచల్ ప్రదేశ్ | 78 | 33 | 39 | 3 |
ఛత్తీస్ గఢ్ | 67 | 9 | 58 | 0 |
లడఖ్ | 43 | 19 | 24 | 0 |
అండమాన్ నికోబార్ దీవులు | 33 | 0 | 33 | 0 |
|
20 | 13 | 7 | 0 |
పుదుచ్చేరీ | 16 | 7 | 9 | 0 |
|
13 | 1 | 11 | 1 |
మణిపూర్ | 7 | 5 | 2 | 0 |
మిజోరం | 1 | 0 | 1 | 0 |
|
1 | 0 | 1 | 0 |
|
1 | 0 | 1 | 0 |
మొత్తం | 90,813 | 53,662 | 34,271 | 2,875 |