Monday, May 6, 2024

లక్ష మంది కోలుకున్నారు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.

కొత్తగా 2817 పాజిటివ్‌లు
జిహెచ్‌ఎంసిలో 452, జిల్లాల్లో 2365 మందికి వైరస్ నిర్ధారణ
కోవిడ్ దాడిలో మరో 10 మృతి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కోలుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు ఏకంగా 1,00,013 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం మెరుగైన వైద్యసేవలు అందించడం వలనే బాధితులు వేగంగా రికవరీ అవుతున్నారని ఆఫీసర్లు అంటున్నారు. బుధవారం 59,711 మందికి టెస్టులు చేయగా 2817 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసిలో 452 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 36, భద్రాద్రి 89, జగిత్యాల 88, జనగామ 41, భూపాలపల్లి 26, గద్వాల 33, కామారెడ్డి 62, కరీంనగర్ 164, ఖమ్మం 157, ఆసిఫాబాద్ 19,మహబూబ్‌నగర్ 42, మహబూబాబాద్ 62, మంచిర్యాల 71,

మెదక్ 35, మేడ్చల్ మల్కాజ్‌గిరి 129, ములుగు 18, నాగర్‌కర్నూల్ 41, నల్గొండ 157, నారాయణపేట్ 21, నిర్మల్ 16, నిజామాబాద్ 97, పెద్దపల్లి 75, సిరిసిల్లా 53, రంగారెడ్డి 216, సంగారెడ్డి 76, సిద్ధిపేట్ 120, సూర్యాపేట్ 116,వికారాబాద్ 27, వనపర్తి 45, వరంగల్ రూరల్ 46,వరంగల్ అర్బన్ లో 114, యాదాద్రిలో మరో 73 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో 10 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,33,406కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 1,00,013 మందికి చేరింది.ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 32,537 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 25,293 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 856కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు

15 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 15,42,978 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు పాజిటివ్ సోకిన వారిలో 92,050 మంది అసింప్టమాటిక్ ఉండగా, 41,356 మందికి సింప్టమ్స్‌తో ఉన్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

2817 New Corona Cases Registered in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News