Monday, April 29, 2024

అమెరికాలో ఒకేరోజు మూడుచోట్ల కాల్పులు

- Advertisement -
- Advertisement -

3 injured in shooting at South Florida mall

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఒకేరోజు మూడుచోట్ల కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. యుఎస్ లోని మేరీల్యాండ్ లో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కాల్పులు జరిపినట్టు భావించిన అనుమానితున్ని అక్కడికక్కడే కాల్చివేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పులు జరపడానికి కారణాలు ఇంకా తెలియాల్సిఉంది. దక్షిణ ఫ్లోరిడాలోని ఓ మాల్ లో రెండు సముహాలకు మధ్య గొడవ కాల్పులకు దారి తీసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లోనూ శనివారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురిపై దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. వారికోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

3 injured in shooting at South Florida mall

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News