Monday, April 29, 2024

విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో 8మంది మృతి

- Advertisement -
- Advertisement -

Visakha-gas-leak

అమరావతి: విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో కెమికల్ గ్యాస్ లీకైన ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తుంది. గ్యాస్ లీక్ ఘటన వివరాలను హోం శాఖ అధికారులు  తెలుసుకుంటున్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన సహాయ చర్యల్లో భాగంగా అంబులెన్సులు, మెడికల్ కిట్లతో భారత నౌకదళం రంగంలోకి దిగింది.

అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8మంది మృతి చెందారు. ఆర్ ఆర్. వెంకటాపురంలో గ్యాస్ లీకేజీ కారణంగా పలువురికి అస్వస్థత. ఆర్ఆర్. వెంకటాపురంలోని కాల్పలో పడి ఇద్దరు, బావిలో పడి ఒకరు మృతి చెందారు. కెజీహెచ్ క్యాజువాల్టీలో ముగ్గురు, ఆర్పీ వార్డులో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

ఎపి సిఎం జగన్ ప్రత్యేక విమానంలో 11:45 గంటలకు విశాఖ చేరుకోనున్నారు. ఆయన బాధితులను కలిసి పరామర్శించనున్నారు. గ్యాస్ లీకైన ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల మేర ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

8 dead after gas leak from chemical plant in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News