Monday, April 29, 2024

99.64% పోలింగ్

- Advertisement -
- Advertisement -

99.64 per cent polling was recorded in MLC by-election

 

ప్రశాంతంగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉప ఎన్నిక పిపిఈ కిట్లు ధరించి ఓటేసిన కరోనా బాధితులు ఓటేసిన స్పీకర్ పోచారం, మంత్రి ప్రశాంత్‌రెడ్డి 12న కౌంటింగ్ కవిత గెలుపు ఖాయం : మంత్రి వేముల

మన తెలంగాణ/ నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ ఎంఎల్‌సి ఉప ఎన్నికలో 99.64 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 824 ఓట్లకు గాను, 821 ఓట్లు పోలయ్యాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేశారు. ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, భీంగల్, బాన్సువాడ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, నిజామాబాద్ నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు ఓట్లు వేశారు. కరోనా సోకిన ప్రజాప్రతినిధులు పిపిఒ కిట్లు ధరించి ఓట్లు వేశారు. ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 16 మంది పిపిఇ కిట్ ధరించి ఓటేశారు. ఈ నెల 12వ తేదీన పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల్లో పూర్తి ఆధిక్యత ఉన్న టిఆర్‌ఎస్ మంరిత మెజార్టీ కోసం పకడ్బందీగా పావులు కదిపింది.

దీంతో 100 శాతం పోలింగ్ కాగా 90% ఓట్లు మావే అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. కరోనా కారణం గా ఏప్రిల్‌లో జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడగా జిల్లా యంత్రాంగం తగిన జాగ్రత్తలు 99.64% పోలింగ్ తీసుకుంది. ఉమ్మడి జిల్లాలో ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుపాల్సి ఉండగా 50 చోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఖచ్చితమైన కోవిడ్ నిబంధనలు పాటించారు. ఆయా మండలాల్లో స్థానిక ఓటర్లు, ఓటు హక్కు వినియోగించుకోగా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు ఓటుహక్కు వినియోగించు కున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రగతిభవన్ నుండి వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును సమీక్షించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే కరోనా పాజిటివ్ నిర్ధారణ ఓటరు చివరగా ఓటు వేసేందుకు అనుమతించారు.

దుబ్బాక స్థానానికి నామినేషన్లు

దుబ్బాక స్థానానికి ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. శుక్రవారం నాడు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఒక సెట్ నామినేషన్లు దాఖలు చేసినట్లు సిఇఒ శశాంక్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News