Monday, April 29, 2024

సిఎం కెసిఆర్‌పై స్టాలిన్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

DMK chief MK Stalin praises CM KCR

 

n జిఎస్‌టి పరిహారం
అంశంలో తెలంగాణ
వైఖరికి అభినందనం

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ పరిహారం విషయంలో తెలంగాణ వైఖరిని అభినందిస్తూ తెలంగాణ సిఎం కెసిఆర్‌కు డిఎంకే అధినేత ఎంకె స్టాలిన్ లేఖ రాశారు. తెలంగాణ సిఎంతో పాటు పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, పుదుచ్ఛేరి ముఖ్యమంత్రులకు కూడా ఆయన లేఖ రాశారు. జీఎస్టీ పరిహారం విషయంలో ఈ రాష్ట్రాలు తమ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాయని పొగడ్తలు కురిపించారు. కేంద్రం ఇచ్చిన ఆప్షన్స్‌కు ఈ రాష్ట్రాలు వ్యతిరేకంగా నిలవడం అభినదించదగ్గ విషయమని అన్నారు. జిఎస్టీ విషయంలో కేంద్రం, పలు రాష్ట్రాల ప్రయోజనాలను వమ్ము చేస్తోందని, కేంద్ర నిర్ణయాలను అడ్డుకుంటున్నందుకు తమిళనాడు ప్రజలంతా తెలంగాణ, ఢిల్లీ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలను అభినందిస్తున్నారని అన్నారు. వివిధ రాష్ట్రాలకు కేంద్రం నుంచి రూ.47,272 కోట్ల జిఎస్టీ పరిహారం రావాల్సి ఉందని కాగ్ వెల్లడించిన రిపోర్టును ప్రస్తావంచిన ఆయన, ఈ నిధులను వెంటనే చెల్లించేలా కేంద్రంపై ఒత్తిడిని పెంచాలని సలహా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News